IND vs AFG : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో తన రెండో మ్యాచ్ ని ఆడింది.మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద ఘనవిజయాన్ని సాధించిన ఇండియన్ టీం ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ టీమ్ మీద కూడా ఒక సూపర్ విక్టరీని కొట్టి వరల్డ్ కప్ లో ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక ఇప్పటికే ఇండియన్ టీం రెండు మ్యాచ్ ల్లో గెలిచి నాలుగు పాయింట్లు సంపాదించుకుంది. ఇక మ్యాచ్ వివరాల లోకి వెళితే మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఇక ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లలో సాహిది 80 పరుగులు చేయగా, హాజ్మతుల్లా 62 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీ లు చేయడంతో ఆఫ్గన్ టీం నిర్ణీత 50 ఓవర్లకి అంత భారీ స్కోర్ చేయగలిగింది. ఇక ఇండియన్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు,ఇక కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ టీమును కట్టడి చేయడంలో ఇండియన్ బౌలర్లు కొంతవరకు ఫెయిల్ అయినప్పటికీ ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్ మెన్స్ మాత్రం చాలా బాగా బ్యాటింగ్ చేశారనే చెప్పాలి. ఇక 273 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీం మొదటి నుంచి ఎదురు దాడికి దిగింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడి ఈ వరల్డ్ కప్ లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. 84 బంతుల్లో 5 సిక్సులు, 16 ఫోర్ లతో 131 పరుగులు చేశాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
తనదైన రోజు రోహిత్ శర్మ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. అందుకే రోహిత్ శర్మని హిట్ మాన్ అని పిలుస్తారు.గ్రౌండ్ నలుదిక్కుల షాట్లు కొడుతూ బౌలర్ ఎవరైనా పర్లేదు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతూ తనలో ఉన్న ఫైర్ ని మరొకసారి బయటకు తీశాడు. గ్రౌండ్ మొత్తం దద్దరిల్లెలా అఫ్గాన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.131 పరుగులు చేశాక రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు.అప్పటికే క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా శ్రేయాస్ అయ్యర్ సహాయం తో మిగిలిన స్కోర్ కొట్టి ఇండియన్ టీం కి ఘన విజయాన్ని అందించాడు.35 ఓవర్లల్లోనే 273 పరుగులను చేసి ఇండియా ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసింది…రోహిత్ శర్మ కొట్టిన షాట్లకి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఏం చేయాలో తెలియక గ్రౌండ్ లోనే ఒకరు మొఖలు ఒకరు చూస్తూ నిలబడి పోయారు అంతే…2019 వరల్డ్ కప్ లో 5 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఈ వరల్డ్ కప్ లో తన మొదటి సెంచరీ ని నమోదు చేసుకున్నాడు.
ఇక ఈ వరల్డ్ కప్ లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ ఇండియన్ టీం కి గెలుపులు అందిస్తూ అలాగే అత్యధిక సెంచరీలు చేసే విధంగా రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు…ఇక మ్యాచ్ లో గెలిచి వరుసగా రెండో విజయాన్ని కూడా ఇండియన్ టీమ్ అందుకోవడం జరిగింది.ఇక ఇండియన్ టీమ్ గెలుపును ఇప్పుడు అప్పుడే ఆపే టీం వరల్డ్ కప్ లో అయితే కనిపించడం లేదు. ఇక 14వ తేదీన పాకిస్తాన్ మీద కూడా ఘన విజయాన్ని సాధించి మరోసారి పాకిస్తాన్ మీద ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఇండియన్ టీం రెడీ అవుతుంది…