Rajinikanth : రజినీకాంత్ జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను అందుకోవడం లేదు. దీంతో ఓ మంచి విజయం కోసం చూస్తున్న సూపర్ స్టార్‌కు ‘జైలర్’ మూవీ బంపర్ హిట్ అందించింది. అయితే ఎందుకు ముఖ్య కారణం మీ చిత్ర దర్శకుడు నెల్సన్. రజనీకాంత్ కెరియర్ లో ఎప్పుడూ లేనట్టుగా కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేసి మరి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. కొన్ని అనవసరమైన వాటిని దూరంగా ఉంచి.. ఈ సినిమా విజయానికి కారణమయ్యారు డైరెక్టర్.
ఇంట్రడక్షన్ సాంగ్
రజనీకాంత్ సినిమాలలో మామూలుగా ఇంట్రడక్షన్ పాటలు తప్పకుండా ఉంటాయి. చంద్రముఖి, నరసింహ లాంటి సినిమాలలో ఆయన ఇంట్రడక్షన్ పాటలు ఎంత పాపులర్ అయ్యాయో మనకు తెలుసు. అయితే జైలర్ సినిమాలో మాత్రం రజనీకాంత్ ఇంట్రడక్షన్ చాలా సాదాసీదాగా ఉంటుంది.
లవ్ సీక్వెన్స్
అంతేకాదు చాలా సీరియస్ గా సాగే సినిమాలలో కూడా రజనీకాంత్ కి లవ్ సీక్వెన్స్ అనేది పెట్టక మానరు మన దర్శకులు. కానీ నెల్సన్ మాత్రం అలాంటి అనవసరమైన సన్నివేశాలకి ఈ చిత్రంలో పోలేదు. నరసింహ తరువాత రజినీకాంత్, రమ్యకృష్ణ కలిసి ఈ సినిమాలో నటించిన వారి మధ్య పెద్దగా సీన్లు పెట్టలేదు డైరెక్టర్.
పంచ్ డైలాగులు
రజినీకాంత్ పంచ్ డైలాగులు అంతే పడి చస్తారు ప్రేక్షకులు. ‘ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే’, నాన్న పందులే గుంపుగా వస్తాయి’, ‘లక లక లక’…. లాంటి డైలాగులు మనము తరచుగా అందరి నోటా వినవే. కానీ అలాంటి డైలాగులు చెప్పే సూపర్ స్టార్ రజినీకాంత్ ని హీరోగా పెట్టుకుని కూడా డైరెక్టర్ పంచుల జోలికి పోలేదు.
ఫైట్ సీన్
ఇక ఫైనల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్ సీన్ కూడా ఈ సినిమాలో పెట్టలేదు. విలన్ తో ఫైట్ చేసే ఛాన్స్ ఈ సినిమాలో ఉన్న.. అలాంటి సీన్ల జోలికి నెల్సన్ పోలేదు.
కానీ ఒకటి మాత్రం నిజం…కమర్షియల్ గా ఆలోచించి ఇవన్నీ పెట్టలేదు కాబట్టే ఈ సినిమా ఇప్పుడు ఇంతటి విజయం సాధించింది.