Mohammed Siraj: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు చాలామంది బౌలర్లు వాళ్ల బౌలింగ్ తో వరల్డ్ నెంబర్ 1 బౌలర్లు గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ లో మన ఇండియన్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ ఆర్ వికెట్లు తీయడంతో ప్రస్తుతం ఆయన ఎంఆర్ఎఫ్ ఐసీసీ ఓడిఐ వరల్డ్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకున్నాడు.
ఇంతకుముందు సిరాజ్ నెంబర్ ఎయిట్ పొజిషన్ లో ఉండేవాడు ఇప్పుడు ఏకంగా 694 పాయింట్లు దక్కించుకొని నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు ఇంతకుముందు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఆస్ట్రేలియన్ బౌలర్ అయిన జోస్ హజిల్ వుడ్ ని వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. నిజానికి ఇంతకుముందు కూడా సిరాజ్ నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకున్నాడు. కానీ ఈమధ్య ఆయన పర్ఫామెన్స్ అంత మెరుగ్గా లేకపోవడంతో నెంబర్ 8 కి పడిపోయాడు కానీ దాంతో రీసెంట్ గా ఏషియా కప్ ఫైనల్లో శ్రీలంక మీద ఆడిన మ్యాచ్ అనేది ఆయనకు బాగా హెల్ప్ అయింది.దాంతో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు లో ఉన్న టాప్ బౌలర్లు అయినా జోస్ హాజిల్ వుడ్ గుడ్, ట్రంట్ బోల్ట్ , మిచల్ స్టార్క్ ,రషీద్ ఖాన్ లాంటి బౌలర్లు అందరినీ దాటుకుని ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ ని చేరుకున్నాడు. వరల్డ్ కప్ లో కూడా ఇదే రీతిలో బౌలింగ్ చేస్తే ఇక ఆయనే నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతాడు. జోస్ హాజల్ వుడ్ 677 పాయింట్ తో ఇంతకుముందు ఫస్ట్ పొజిషన్ లో.ఉంటే సిరాజ్ మాత్రం 694.పాయింట్లతో ఫస్ట్ పోజీషన్ ని దక్కించుకున్నాడు. అంటే సిరజ్ కి.హెజిల్ వుడ్ కి మధ్య 17 పాయింట్ల తేడా ఉంది. ఇక వరుసగా మహమ్మద్ సిరాజ్ , జోస్ హజిల్ వుడ్ , ట్రంట్ బోల్ట్, ముజీబ్ ఉర్ రహ్మాన్ ,రషీద్ ఖాన్ లాంటి బౌలర్లు టాప్ ఫైవ్ పొజిషన్ లో కొనసాగుతున్నారు…