https://oktelugu.com/

Hyundai Car : హ్యుందాయ్ బంఫర్ ఆపర్.. ఆ కారుపై ఏకంగా రూ.55 వేల డిస్కౌంట్..

తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఓ కారుపై ఏకంగా రూ.55,000 డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. వీటితో పాటు మరికొన్ని కార్లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : February 4, 2024 / 11:29 AM IST

    Hyundai cars discount

    Follow us on

    Hyundai Car : ఏదైనా వస్తువు కొనాలనుకునేటప్పుడు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తుంటాం. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కొన్ని సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అయితే కార్ల కొనుగోలు విషయంలో మాత్రం ఒక్కోసారి సాధారణ రోజుల్లో కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తాయి.కొన్ని కంపెనీలు తమ సేల్స్ పెంచుకునేందుకు అదిరిపోయే తగ్గింపు ధరలతో కార్లను విక్రయిస్తాయి. కారు కొనాలనుకునేవారు ఈ ఆఫర్లతో దక్కించుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఓ కారుపై ఏకంగా రూ.55,000 డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. వీటితో పాటు మరికొన్ని కార్లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

    దేశీయ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ అమ్మకాల్లో దూసుకుపోతుంది.  ఈ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది.   ప్రస్తుతం పండుగలు, ప్రత్యేక రోజులు కాకపోయినా  ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించడంతో వినియోగదారులు ఈ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే హ్యుందాయ్  కంపెనీ ఏయే కారుపై ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించిందో చూద్దాం..

    హ్యుందాయ్ నుంచి ఇప్పటికే కొన్ని కార్లు మార్కెట్లో అలరిస్తున్నాయి. వీటిలో Grand i10 మోడల్ ఒకటి. దీనిపై  రూ.48,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో ఎక్చేంజ్ బోనస్ రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.35,000, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ గా రూ.3 వేలు తగ్గిస్తోంది. అలాగే Hyundai i10 మోడల్ పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.10,000 కలిపి మొత్తం రూ.25,000 డిస్కౌంట్ ను ఇస్తోంది.

    ఇదే కంపెనీకి చెందిన మరో మోడల్ ‘ఆరా’ పై క్యాష్ డిస్కౌంట్ రూ.20,000, ఎక్చేంజ్ బోనస్ రూ.10,000, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా రూ.3 వేలతో కలపి మొత్తం రూ.33,000 డిస్కౌంట్ ను ఇస్తోంది. ఇక వెర్నా కారుపై రూ.55 వేల వరకు తగ్గింపు ఇవ్వనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.30,000, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.25,000 అందిస్తోంది. అర్కిజర్ మోడల్ రూ.45 వేల డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.20 వేల తగ్గింపును ఇస్తోంది.