Babar Azam: మరొకది గంటల్లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రతి టీమ్ వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రతి టీం కూడా వాళ్ల దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ని ఆయుధంగా వాడుకొని కప్పుని ఎగరేసుకుపోవాలని చూస్తుంది. అందులో భాగంగానే అహ్మదాబాద్ వేదిక గా అన్ని దేశాలకు సంబంధించిన కెప్టెన్ల సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఆ మీటింగ్ లో చాలా ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవి శాస్త్రి తనదైన రీతిలో చమత్కారాలను స్పందిస్తూ నవ్వులు పూయించాడు.
ఇక ఇదే మీటింగ్ లో ఒక రిపోర్టర్ రోహిత్ శర్మ కు ఒక ప్రశ్నను సంధిస్తూ 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో బౌండరీలను ఉద్దేశించి పలాన జట్టు విజయం సాధించినట్టుగా ప్రకటించడం జరిగింది. అలా ఒక మ్యాచ్ ని బౌండరీస్ ద్వారా గెలిచినట్టుగా ప్రకటించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని అడగ్గా, రోహిత్ శర్మ దానికి ఫన్నీ వేలో ఆన్సర్ చెప్తూ విజేతను నిర్ణయించడం నా పని కాదు సార్ అంటూ నవ్వాడు, దాంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. ఇక ఇది అర్థం కాని జోస్ బట్లర్ కి పక్కనే ఉన్న బాబర్ అజమ్ రోహిత్ శర్మ వేసిన కౌంటర్ ని వివరించి చెప్పడం జరిగింది. ఇక అదే వేదిక పైన సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ అయిన బావుమ కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కాడు.అయితే ఆయన ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోయి ఉన్నాడు దానివల్ల ఒక కునుకు తీస్తూ కనిపించాడు…
ఇక ఇదిలా ఉంటే వ్యాఖ్యాతగా వ్యవహరించే రవి శాస్త్రి మీటింగ్ మధ్యలో తనదైన హాస్యాన్ని పండిస్తూ ఆ మీటింగ్ మొత్తాన్ని చాలా ఆహ్లాదపరిచాడు. ఇక అందులో భాగంగానే బాబర్ అజమ్ ని హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంది అని అడిగాడు. దాంతో బాబర్ అజమ్ మూసి ముసి నవ్వులు నవ్వుతూ చాలాసార్లు చెప్పాను మళ్లీ చెప్తున్నాను హైదరాబాద్ బిర్యానీ బెస్ట్ బిర్యానీ… కరాచీ బిర్యానీతో పోలిస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది అంటూ సమాధానం చెప్పాడు.ఇక పాకిస్తాన్ తను ఆడే రెండు వార్మప్ మ్యాచ్ లను హైదరాబాద్ వేదికగా ఆడుతుండగా వాళ్లు హైదరాబాద్ లోనే స్టే చేయడం జరుగుతుంది.
ఇక అదే విధంగా వాళ్ళ మొదటి మ్యాచ్ కూడా హైదరాబాద్ వేదికగానే జరగగా ఆ మ్యాచ్ ముగింసేంత వరకు వాళ్ళు ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది.ఇక ఈ క్రమంలోనే క్రికెటర్లు హైదరాబాద్ లో పలు ప్రాంతాలను విజిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీలైనన్ని సార్లు బిర్యానీని తినడానికి పాక్ క్రికెటర్లు ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఈ క్రమంలో పాకిస్తాన్ ఇండియాకి రాక 7 సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో ఇప్పుడు రావడంతో వాళ్ళని చూసిన అభిమానులు కూడా వాళ్లకు విశేష స్పందనని తెలియజేస్తున్నారు. దాన్ని చూసిన పాకిస్తాన్ క్రికెటర్లు మురిసిపోతున్నారు…
Babar Azam about Biryani of Hyderabad.#BabarAzam | #WorldCup2023
— Ehtisham Siddique (@iMShami_) October 4, 2023