Alive Foods : చంపి కాదు.. బతికుండగానే ఈ జీవుల్ని మనుషులు లాగిస్తారు

అయితే జంతువుల్ని బతికుండగానే తినడం మీరు ఎప్పుడైనా చూశారా? అబ్బే అలా ఎలా తింటారు? అసలు వాళ్లు మనుషులేనా? లేక నరరూప రాక్షసులా? అని అంటారా? సరే మీరు ఏమైనా అనుకోండి..పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.

Written By: Anabothula Bhaskar, Updated On : February 19, 2024 11:53 am
Follow us on

Alive Foods : చికెన్ అంటే ఇష్టంగా తింటాం. మటన్ అంటే లొట్టలేసుకొని లాగించేస్తాం. చేపలంటే వారేవా అనుకుంటూ ఆరగిస్తాం. రొయ్యలు అంటే సూపరో సూపర్ అనుకుంటూ కుమ్మేస్తాం. మనం తినే ఏ మాంసాహారం వంటకమైనా.. ముందుగా ఆ జంతువుల్ని చంపి.. శుభ్రం చేసుకుని.. నచ్చినట్టు వండుకొని.. మెచ్చినట్టు ఆహార దినుసులు వేసి.. ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఒక్కో ముక్కను ఆఘ్రాణించు కుంటూ పొట్ట నిండే దాకా తింటాం. అయితే జంతువుల్ని బతికుండగానే తినడం మీరు ఎప్పుడైనా చూశారా? అబ్బే అలా ఎలా తింటారు? అసలు వాళ్లు మనుషులేనా? లేక నరరూప రాక్షసులా? అని అంటారా? సరే మీరు ఏమైనా అనుకోండి..పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.

కప్పలు

మనదేశంలో పెద్దగా వీటిని తినరు కానీ.. చైనా, జపాన్ వాసులు ఇష్టంగా తింటారు. చిన్న చిన్న కప్పల్ని బతికి ఉండగానే లాగిస్తారు. చైనాలో “సాన్ జీ ఎర్”, జపాన్ లో “లైవ్ ఫ్రాగ్ సాషిమి” అనే వంటకాలలో బతికున్న కప్పలను వేసుకొని ఇష్టంగా తింటారు. ఇలా తినడం వల్ల ఒంటికి మంచిదని వారు చెబుతుంటారు.

ఆక్టోపస్

కాల్షియం ఎక్కువగా ఉండే సముద్రపు జంతువుల జాబితాలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలో చిన్న చిన్న ఆక్టో పస్ లను బతికి ఉండగానే లాగించేస్తారు.

కోతి మెదడు

ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోతులను ఆహారంగా వండుకొని తింటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కోతి మెదడును లాగించేస్తారు. అరుదైన సందర్భాల్లో కోతి బతికి ఉన్నప్పుడు దాని తల పగలగొట్టి అందులో ఉన్న బయటికి తీసుకుని అలాగే తింటారు. కొన్ని ఆటవిక జాతులు ఇప్పటికీ ఇదే ఆహార విధానాన్ని కొనసాగిస్తున్నాయి.

Pulasa Fish

చేపలు

జపాన్ దేశంలో “ఇకి జుకురి” అనే వంటకంలో చేపలను సజీవంగా ఉన్నప్పుడే అందులో వేసుకొని తింటారు. ఆ చేపలను కూడా రకరకాలుగా మెలి తిప్పి లొట్టలు వేసుకుని తింటారు.

స్క్వీడ్

సముద్రపు జాతికి చెందిన ఈ జీవిని కొరియా దేశస్థులు బతికి ఉన్నప్పుడే తింటారు. కొరియా దేశాల్లో దీనిని “సన్నక్జి” అని పిలుస్తారు. దీన్ని లైవ్ గా తినటం వల్ల శరీరానికి మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

రొయ్యలు

రొయ్యల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ సముద్ర ప్రాంతాల్లో దొరికే పప్పు రొయ్యలను చాలామంది సజీవంగా ఉన్నప్పుడే తింటారు. కొన్ని వంటకాలలో వీటిని వేసుకొని ఇష్టంగా తింటారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉండే కొన్ని రకాల జాతులు బతికి ఉన్న రొయ్యలు తినడాన్ని తమ ఆహార సంప్రదాయంగా భావిస్తారు.

కీటకాలు

చీమలు, తేనెటీగలు, ఉసిళ్ళు వంటి వాటిని వేయించుకుని తినడం కొన్ని ప్రాంతాలలో ఆహార సంప్రదాయంగా ఉంది. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఒక రకమైన చీమలతో వంటకాలు వండుకొని ఇష్టంగా ఆరగిస్తారు.