https://oktelugu.com/

Lakshadweep: లక్షద్వీప్ లకు ఎలా వెళ్లాలి? అక్కడ ఏమేం ఉన్నాయి? ఖర్చు ఎంతంటే?

భారతదేశానికి మూడు వైపుల సముద్ర మార్గం ఉంది. పడమర వైపు ఆరేబియా సముద్రం ఉంటుంది. ఈ సముద్రంలో లక్ష ద్వీప్ లు కొలువై ఉన్నాయి. భారత్ భూభాగంలో ఉన్న కేరళ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఇవి కనిపిస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2024 4:45 pm
    Lakshadweep

    Lakshadweep

    Follow us on

    Lakshadweep: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధులు కామెంట్స్ చేసిన తరువాత లక్ష ద్వీప్ ల గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో ‘చలో లక్షద్వీప్’ అనే యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు సెలబ్రెటీలు సైతం తమ నెక్ట్స్ ట్రిప్ లక్ష ద్వీప్ కే అని ప్రకటించడం మరింత ప్రాధాన్యతను సంతరించింది. ఈ నేపథ్యంలో కొందరు లక్ష ద్వీప్ అందాలను ఇప్పటికే సోషల్ మీడియాలో ఉంచారు. వీటిని చూసి చాలా మురిసిపోతున్నారు. వచ్చే వేసవిలో ఇక్కడికి ట్రిప్ వేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో అసలు లక్షద్వీప్ కు ఎలా వెళ్లాలి? అక్కడే ఏమేం చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళితే..

    భారతదేశానికి మూడు వైపుల సముద్ర మార్గం ఉంది. పడమర వైపు ఆరేబియా సముద్రం ఉంటుంది. ఈ సముద్రంలో లక్ష ద్వీప్ లు కొలువై ఉన్నాయి. భారత్ భూభాగంలో ఉన్న కేరళ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఇవి కనిపిస్తాయి. లక్ష ద్వీపాల గురించి తమిళ సాహిత్యంలోని ‘పుననానూరు’ అనే పుస్తకంలో ఉంది. ఒకప్పుడు ఇది ద్రవిడ దేశంలో భాగంగా ఉండేవి. 7వ శతాబ్ధంలో పల్లవ రాజు ఆధీనంలో ఇవి కొనసాగేవి. ఆ తరువాత వీటిని 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.

    లక్షద్వీప్ లో ఒకే ఒక జిల్లా ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించిన తరువాత 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 60,595 మంది నివసిస్తున్నారు. ఇక్కడున్న వారంతా ముస్లిం వారే. తమ పూర్వీకులు ఒక పెద్ద తుఫానులో ఇక్కడికి కొట్టుకురాగా.. వారి వారసులుగా కొనసాగుతున్న వారు కొందరైతే.. వ్యాపారం కోసం వచ్చిన వారు మరికొందరు. లక్షద్వీప్ లో మొత్తం 36 దీవులు ఉన్నాయి. వీటిలో 12 పగడపు దీవులు, 17 నిర్జీవ దీవులు ఉన్నాయి. వీటిలో కవరట్టి, ఆగట్టి అనేవి ప్రధాన దీవులు.

    లక్షద్వీప్ లోని ఆగట్టిలో ఓ విమానాశ్రయం ఉంది. ఇక్కడికి కొచ్చిన్ నుంచి నేరుగా విమానా రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇక్కడికి విమానాలను నడుపుతుంది. అలాగే కొచ్చి నుంచి నౌకలు కూడా ఉన్నాయి. లక్ష ద్వీప్ పర్యటనకు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు అనుకూల సమయం. మిగతా కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కాలంలో కూడా పర్యాటకులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. లక్ష ద్వీప్ లో ఉండడానికి ప్రత్యేక వసతులు ఉన్నాయి. అలాగే మంచి ఆహారం కూడా లభిస్తుంది.