https://oktelugu.com/

IPL 2024 : ఐపీఎల్ 2024 ఇందులో మాత్రమే చూడొచ్చు.. దీనికి ఎంత డేటా కావాలంటే?

ఈసారి ఎన్నికలతోపాటు టీ20 ప్రపంచకప్‌ కూడా ఉంది. దీంతో మే 26లోపే ఐపీఎల్‌ ముగిసేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 12:14 PM IST

    IPL 2024

    Follow us on

    IPL 2024 : ఐపీఎల్‌ – 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈసారి కూడా ఐపీఎల్‌ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గతేడాది లాగానే ఐపీఎల్‌ స్ట్రీమింగ్‌ను ఉచితంగా అందిస్తామని జియో తెలిపింది. కానీ మ్యాచ్‌ చూడడానికి మన మొబైల్‌లో ఎంత డేటా కావాలి.. ఎంత ఎంబీపీఎస్‌కు ఎంత డేటా రీచార్జి చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.

    ఒక మ్యాచ్‌కు ఎంత డేటా కావాలి?
    జియో సినిమాలో 4కే క్వాలిటీతో మ్యాచ్‌ను పూర్తిగా చూడాలంటే కనీసం 25 జీబీ డేటా అవసరం. ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీతో స్ట్రీమింగ్‌ చేయాలంటే 12 జీబీ డేటా ఖర్చవుతుంది. ఇక మీడియం క్వాలిటీతో మ్యాచ్‌ చూడడానికి 2.5 జీబీ డేటా అవసరం. లో క్వాలిటీతో చూడాలన్నా కనీసం 1.5 జీబీ డేలా ఉండాలి. మొబైల్‌లో డేటా చూడాలనుకుంటే మీడియం, లో క్వాలిటీ ఆప్షన్లు ఎంచుకోవడం మంచింది. ఫుల్‌ హెచ్‌డీ, 4కే క్వాలిటీలో చూడాలంటే కనీసం రోజుకు రూ.200 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొబైల్‌లో మ్యాచ్‌ చూసేటప్పుడు మీ డేటాకు అనుగుణంగా క్వాలిటీ సెట్‌ చేసుకోండి.

    మార్చి 22 నుంచి ఐపీఎల్‌..
    సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)ను కాస్త ముందుగానే నిర్ణయించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈమేరకు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ధుమాల్‌ ఐపీఎల్‌ తేదీలను ఇటీవల ప్రకటించారు. ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు అన్నీ భారత్‌లోనే జరుగుతాయని తెలిపారు. మార్చి 22న లీగ్‌ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ముందుగా 15 రోజుల షెడ్యూల్‌ ప్రకటించి, ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత మిగతా షెడ్యూల్‌ ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.

    2009, 2014లో విదేశాల్లో..
    2009, 2014లో కూడా సార్వత్రిక ఎన్నికలతో ఐపీఎల్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో బీసీసీఐ ఆ రెండుసార్లు మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించింది. 2009లో ఐపీఎల్‌ను దక్షిణాప్రికాలో నిర్వహించారు. ఇక 2014లో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించారు. ఇక 2019లో మాత్రం ఎన్నికలు ఉన్నప్పటికీ మొత్తం టోర్నీని భారత్‌లోనే నిర్వహించారు. ఈసారి ఎన్నికలతోపాటు టీ20 ప్రపంచకప్‌ కూడా ఉంది. దీంతో మే 26లోపే ఐపీఎల్‌ ముగిసేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నట్లు సమాచారం.