JanaSena: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా కమిటీలు వేసిన పవన్ ఇప్పుడు గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసి పటిష్టంగా పార్టీని నిర్మించాలని చూస్తున్నారు. దసరా నుంచి బస్సుయాత్ర వాయిదా వేయడానికి కూడా కారణం ఇదేనంటున్నారు.

జనసేనను క్షేత్రస్తాయి నుంచి బలోపేతం చేశాక ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ జనసేన నేతల సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యేగా ఎవరిని నిలబెట్టాలన్నది అక్కడే తేల్చి పార్టీ బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పార్టీలో కుమ్ములాటలు, అసమ్మతి దరిచేరకుండా యాత్రలోనే వీటికి క్లారిటీ ఇచ్చి ముగింపు చేసేలా ప్లాన్ సిద్ధం చేశారు. ఈ మేరకు నియోజకవర్గ నేతలకు పవన్ సంకేతాలు పంపారు.
Also Read: Janasena Early Elections: ముందస్తు ఎన్నికలు వస్తే జనసేన గెలిచే స్థానాలు ఎన్ని..?
ఈ క్రమంలోనే పవన్ బస్సుయాత్రకు ముందే గ్రామస్థాయిలో జనసేన మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రతీ గ్రామ కమిటీని, మెంబర్లను పవన్ యాత్రలో భాగస్వాములు చేయాలని.. వారికి పార్టీ పదవులు ఇచ్చి.. పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని భావిస్తోంది.
గెలుపు అవకాశాలున్న కోస్తా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై వపన్ ముందుగా ఫోకస్ పెంచారు. అటు సామాజికవర్గపరంగా కూడా కాపుల ప్రాబల్యం ఎక్కువ. గత ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో కాపుల్లో మెజార్టీ వర్గం జగన్ వైపు నడిచినా.. అధికారంలోకి వచ్చాక తమను అన్నివిధాలా దగా చేశారన్న ఆవేదన, బాధ, కసి కాపుల్లో ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అన్యాయం చేశామన్న ఆవేదన ఉంది. అందుకే ఈసారి కాపుల ఓట్లు పవన్ కు ఏకపక్షంగా పడే అవకాశమైతే ఉంది.

అందుకే కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఫుల్ ఫోకస్ చేసింది. అయితే అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా వాటిని జనసేన ఖాతాలో వేసేందుకు మాత్రం పవన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామస్థాయి నుంచే పవన్ కల్యాణ్ కు గ్రౌండ్ క్లియర్ చేస్తున్న జనసైనికులు వచ్చే ఎన్నికల్లోపు ఖచ్చితంగా జనసేన పుంజుకునేలా చేస్తున్నారు. పవన్ ను వచ్చేసారి గెలిపించడమే ధ్యేయంగా గ్రామా స్థాయిలో జనసేన మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఇది పూర్తిగా వర్కవుట్ అయ్యాకే పవన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. 2024లో అధికారమే లక్ష్యంగా అటు పవన్, ఇటు జనసైనికులు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
[…] […]
[…] Also Read: JanaSena: Jana soldiers clearing the ground for Pawan Kalyan […]