Times Now Survey: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. అధికార బీఆర్‌ఎస్‌ను ప్రజలు గద్దె దించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. బీజేపీ కూడా ఓటుబ్యాంకు పెంచుకుంది. సీట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు అన్ని పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈసారి లోక్ సభ ఎనికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఏ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుంది? అన్నది ప్రతీ ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద ఉంటుంది అని భావించినప్పటికీ ఏ మేరకు ఉంటుంది అన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కటంలేదు.
తాజా సర్వే ఇలా..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వస్తాయని తేచ్చింది. ఆ పార్టీ 8 నుంచి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాలలో కాంగ్రెస్ జోష్ లో ఉంది. ఇక మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ 3 నుంచి 5 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఇక ఎంఐఎంకు ఒక సీటు గ్యారెంటీ అని చెప్పింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి, ఆయా పార్టీల ఓటింగ్ శాతాలు, ప్రజాభిప్రాయం మేరకు ఈ సర్వే నిర్వహించిన టైమ్స్ నౌ ఈటీజీ తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తేల్చింది. ఇక్కడ నష్టపోయేది బీఆర్‌ఎస్.
కాంగ్రెస్ దూకుడు..
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి మాత్రం కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుందని, ఎన్నికల సమయం వరకు రేవంత్‌రెడ్డి పాలన ప్రజామోదంగా ఉంటే ఆ స్థానాలు ఇంకా పెరిగే అవకాశముందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తేల్చింది. ఇక దీంతో తెలంగాణా కాంగ్రెస్ హస్తగతం అని కాంగ్రెస్ ఆనందంలో ఉంది.
ప్రస్తుతం జీరో..
ప్రస్తుతం కాంగ్రెస్‌కు ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వారు కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ లో తెలంగాణ నుండి ఈ పార్టీ బలం జీరో. కానీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో హీరోగా నిలుస్తారని తేలటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ ఫలితాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భారీగా నష్టపోయేది బీఆర్‌ఎస్ పార్టీ. బీజేపీకి స్వల్పంగా ఓట్లు పెరిగే అవకాశం ఉంది. 2019లో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి 5 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అంటే బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదు. కేంద్రంలో బీజేపీ ఉంటేనే దేశానికి భద్రత అని చాలా మంది భావిస్తున్నారు. ఇది బీజేపీకి లాభం చేకూరుస్తుంది.