Pawan Kalyan – Varahi Yatra : పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర ఎలా ఉంది?

పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర పూర్తయ్యింది. 10 నియోజకవర్గాలు.. 17 రోజులు సాగింది. 14వ తేదీ అన్నవరంలో బయలు దేరి 30వ తేదీ భీమవరంలో ముగిసింది. వారాహి యాత్రకు ముందు ఇది ఎలా జరుగుతుందన్న ఒక ఉద్వేగం ఉండేది. కానీ యాత్ర పూర్తయిన వేళ పవన్ కళ్యాణ్ కు జన నీరాజనం పలికారు. జనాలు పవన్ కళ్యాన్ హారతులతో స్వాగతించారు

Written By: NARESH, Updated On : July 1, 2023 4:04 pm
Follow us on

Pawan Kalyan – Varahi Yatra : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ‘వారాహి విజయ యాత్ర’. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్న దీని గురించే చర్చ. ‘హలో ఏపీ..బై బై వైసీపీ’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్లోగన్ మాస్ లో ఒక రేంజ్ లో రీచ్ అయ్యింది. 2014 ఎన్నికలలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ‘ కాంగ్రెస్ హటావో – దేశ్ బచావో’ అని ఇచ్చిన ఒక స్లోగన్ నేషనల్ వైడ్ గా పాపులారిటీ ని సాధించింది.

పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉభయ గోదావరి జిల్లాల యాత్ర చేపట్టారు.. బహిరంగ సభల్లో ప్రసంగించారు. భీమవరం సభతో ‘వారాహి విజయ యాత్ర’ మొదటి విడత ముగుస్తుంది.

పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర పూర్తయ్యింది. 10 నియోజకవర్గాలు.. 17 రోజులు సాగింది. 14వ తేదీ అన్నవరంలో బయలు దేరి 30వ తేదీ భీమవరంలో ముగిసింది. వారాహి యాత్రకు ముందు ఇది ఎలా జరుగుతుందన్న ఒక ఉద్వేగం ఉండేది. కానీ యాత్ర పూర్తయిన వేళ పవన్ కళ్యాణ్ కు జన నీరాజనం పలికారు. జనాలు పవన్ కళ్యాన్ హారతులతో స్వాగతించారు. ఈ 17 రోజులు ఆంధ్ర రాజకీయాలు మొత్తం కూడా ఈ వారాహి యాత్ర మీదే జరిగింది.

వైఎస్ఆర్ పార్టీ సాక్షి పేపర్ కూడా వారాహి యాత్రపైనే సాగింది. చివరకు ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ పైనే టార్గెట్ చేశారు. పవన్ పై విమర్శలు చేశారు. అంటే పవన్ యాత్ర సక్సెస్ అయినట్టే లెక్క..

పవన్ కళ్యాణ్ మొదటి విడత వారాహి యాత్ర ఎలా ఉంది? రాష్ట్ర రాజకీయాలు ఎలా ప్రభావితం అయ్యాయయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.