https://oktelugu.com/

Rayalaseema Ramanna Chowdary: రజినీకాంత్ తన కోసం రాసుకున్న రామన్న చౌదరి సినిమా స్టోరీని మోహన్ బాబు ఎలా చేశాడు..?

లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో సక్సెస్ లేక ఫెయిల్యూర్ తో కంటిన్యూ అవుతున్న బ్యానర్ లో ఒక సక్సెస్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు రజినీకాంత్ తమిళంలో వచ్చిన ఒక సినిమాని మోహన్ బాబుకి చూపించి తనను రీమేక్ చేయమని చెప్పాడు.

Written By:
  • Gopi
  • , Updated On : October 3, 2023 / 09:04 AM IST

    Rayalaseema Ramanna Chowdar

    Follow us on

    Rayalaseema Ramanna Chowdary: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మంచి నటులలో మోహన్ బాబు ఒకరు ఆయన చాలా మంచి నటుడు అనే విషయం మనందరికీ తెలిసిందే.కానీ ఆయన స్టేజ్ లా మీద సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వల్ల మోహన్ బాబు మంచి నటుడు అనే విషయాన్ని అందరూ మర్చిపోయారు.ఇక దానికి తగ్గట్టుగా నేను మంచి నటుడిని ఆయన కంటే మంచి నటుడిని , ఈయనకంటే మంచి నటుడిని అని ఆయన గురించి ఆయనే చెప్పుకోవడం చూసిన జనాలు ఆయన మాటలు భరించలేక ఆయన పట్టించుకోవడం మానేశారు.ఇక మోహన్ బాబు గారు నిజంగా మంచి నటుడు అనేది ఆయన చేసిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాను చూస్తే మనకు అర్థమవుతుంది.

    ఈ సినిమా ఆయన 500 సినిమాగా తెరకెక్కినప్పటికీ ఈ సినిమాలో ఆయన ఒక అగ్రెసివ్ రోల్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అనే విషయానికి చూసుకుంటే ఈ సినిమా స్టోరీ ని రజనీకాంత్ రాశారు.ఆయన తమిళం లో ఆయన హీరో గా ఈ సినిమాని చేయాలి అనే ఉద్దేశ్యం తో ఈ కథ రాసుకున్నాడట…

    దాంతో ఆయనకి మోహన్ బాబు గుర్తొచ్చి మోహన్ బాబు కి ఈ కథ ఇచ్చి ఈ కథ తో సినిమా చేయి ఈ సినిమా కనక తెలుగులో ఆడితే, నేను తమిళంలో ఈ సినిమాని తమిళం లో రీమేక్ చేస్తాను అని చెప్పాడంట.దాంతో ఈ సినిమాకి డైరెక్టర్ గా సురేష్ కృష్ణని తీసుకొని మోహన్ బాబు ఈ సినిమాని చేశాడు.అయితే ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ కానప్పటికీ ఈ సినిమాలో మోహన్ బాబు యాక్టింగ్ చూసిన రజనీకాంత్ మాత్రం స్టన్ అయిపోయాడు అంట… ఈ క్యారెక్టర్ ని మోహన్ బాబుకు మించి నేను చేయలేను అని నిర్ణయించుకొని ఆ సినిమాని రీమేక్ చేయడం లేదని అని ఓపెన్ గా చెప్పడం జరిగింది. నిజానికి ఆ సినిమాలో మోహన్ బాబు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనే చెప్పాలి.దానిని మ్యాచ్ చేయడం ఏ హీరో వల్ల కూడా కాదు ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా అందులో మోహన్ బాబు నటన చూస్తే అన్ బిలీవబుల్ అనిపిస్తుంది.ఇక ఇలాంటి సినిమాలో మోహన్ బాబు లాగా డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేయాలంటే నటుడికి చాలా అనుభవం ఉండాలి. లేకపోతే ఆ క్యారెక్టర్ అంత పెద్దగా పండదు…ఇంతకుముందు కూడా మోహన్ బాబు, రజినీకాంత్ సలహా మేరకు పెదరాయుడు అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

    అప్పటికే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో సక్సెస్ లేక ఫెయిల్యూర్ తో కంటిన్యూ అవుతున్న బ్యానర్ లో ఒక సక్సెస్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు రజినీకాంత్ తమిళంలో వచ్చిన ఒక సినిమాని మోహన్ బాబుకి చూపించి తనను రీమేక్ చేయమని చెప్పాడు దాంతో మోహన్ బాబు ఆ సినిమాని కొన్ని మార్పులు చేయించి పెదరాయుడు అనే పేరుతో రీమేక్ చేశాడు. దాంట్లో పాపారాయుడు క్యారెక్టర్ కోసం రజనీకాంత్ నటించడం జరిగింది. దానికోసం అయన మోహన్ బాబు దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా నటించారట…

    రజనీకాంత్ ఎవరినైనా నమ్మితే వాళ్లకోసం ప్రాణమిస్తాడు అనడానికి తన ప్రాణ స్నేహితుడు అయిన మోహన్ బాబు ఒక ఉదాహరణ… ఎందుకంటే అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్నాడు అనే ఒకే ఒక ఉద్దేశ్యం తో మోహన్ బాబు కి హిట్టు కావాలనే ఉద్దేశంతో పెదరాయుడు సినిమాని ఆయన కోసం చేశాడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది… అలా మోహన్ బాబు రజనీకాంత్ ల ఫ్రెండ్షిప్ గురించి చాలామందికి తెలియదు కానీ నిజంగా వాళ్ళు మంచి ఫ్రెండ్స్…