Salaar Trailer : సలార్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్… ట్రైలర్ లో అలా హింట్ ఇచ్చిన డైరెక్టర్!

సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : December 21, 2023 11:33 am
Follow us on

Salaar Trailer : సలార్ (Salaar ) మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ టికెట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప్రభాస్ నుండి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సలార్ కెజిఎఫ్ సిరీస్లో భాగం కావచ్చు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు.

Also Read : సలార్ క్లైమాక్స్ కి బాహుబలి కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

దీనిపై చిత్ర యూనిట్ అస్పష్టంగా సమాధానం చెబుతున్నారు. బహుశా వాళ్ళు థియేటర్స్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయాలని కీలక ట్విస్ట్ దాచి ఉంచారనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ట్రైలర్ లో ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడంటూ ఓ ప్రచారం జరుగుతుంది. సలార్ ట్రైలర్ లో ఓ వ్యక్తి మెట్లు ఎక్కుతూ కుర్చీ వైపు వెళుతూ ఉంటాడు.

వెనకనుండి చూపించిన ఆ వ్యక్తి యష్ అనే ప్రచారం మొదలైంది. సలార్ లో యష్ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అదే నిజమైతే సిల్వర్ స్క్రీన్ షేక్ కావడం ఖాయం. యష్-ప్రభాస్ లను వెండితెర మీద చూసి ఫ్యాన్స్ చొక్కాలు చించుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అధికారిక సమాచారం లేదు.

సలార్ మూవీ ఇద్దరు మిత్రుల కథ. రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి పార్ట్ లో ప్రాణ మిత్రులుగా, సెకండ్ పార్ట్ లో బద్ద శత్రువులుగా కనిపిస్తారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశాడు. సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండే అవకాశం లేదు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు.

Also Read : ప్రభాస్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే…