https://oktelugu.com/

MLA Balakrishna AP assembly : అసెంబ్లీలోనూ బాలయ్య అసభ్య పని.. వీడియో వైరల్

సినిమాల్లో హీరోయిన్లతో చేసినట్టు.. ఆర్టిస్టులతో అమర్యాదగా మార్చినట్టుగా.. ఎదురొచ్చిన వారి చెంప చెల్లుమనిపించినట్టు అసెంబ్లీలో కూడా వికృత చేష్టలతో అసభ్య సూచికతో బాలయ్య చూపించిన వీడియో వైరల్ అవుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2023 / 09:06 PM IST
    Follow us on

    MLA Balakrishna AP assembly : అది ఏపీ అసెంబ్లీ.. చట్టాలు చేసే సభ.. ప్రజలందరికీ ఒక రోల్ మోడల్ లాంటిది. అయితే అలాంటి సభలోనూ వికృత నేతల వింత చేష్టలతో ఏపీ అసెంబ్లీ పరువు పోతోంది. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రతినిధిగా ఉన్న బాలయ్య బయట సినీ ఫీల్డ్ లో చేసినట్టుగానే ప్రవర్తిస్తున్నారు.

    ‘ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. లేదంటే కడుపు అయినా చేయాలి’ అని బాలయ్య అన్నాడు.  అసెంబ్లీలోనూ అలాంటి చేష్టలే చేశాడు. ఏపీలో సభా మర్యాదలు గంగలో కలుస్తున్నాయి. తోటి సభ్యులను హేళనగా చూస్తూ బాలక్రిష్ణ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చట్ట సభలోనూ అదే అసభ్య ప్రవర్తన చేసి బాలయ్య తన పరువు తానే పోగొట్టుకున్నాడు. కనీసం అసెంబ్లీకి పంపిన ప్రజలకైనా గౌరవం ఇవ్వని నందమూరి బాలకృష్ణ ఇటు హీరోగానే కాదు.. ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    ఇప్పటికే ఓ నిర్మాతను కాల్చి మానసిక పరిస్థితి బాగాలేదని సర్టిఫికెట్ తెచ్చుకొని తప్పించుకున్నాడు.  బాలయ్య ఏం చేసినా చెల్లుతుందనే భావన ఆయనలో పెరిగిపోయింది. బావ చంద్రబాబు సీఎం కావడంతోనే బాలయ్యకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆయన ఏం చేసినా నడుస్తుందన్న భావన ప్రజల్లో బలంగా పాకిపోయింది.

    సినిమాల్లో హీరోయిన్లతో చేసినట్టు.. ఆర్టిస్టులతో అమర్యాదగా మార్చినట్టుగా.. ఎదురొచ్చిన వారి చెంప చెల్లుమనిపించినట్టు అసెంబ్లీలో కూడా వికృత చేష్టలతో అసభ్య సూచికతో బాలయ్య చూపించిన వీడియో వైరల్ అవుతోంది.