https://oktelugu.com/

ట్విటర్ కు షాకిచ్చిన హైకోర్టు

భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్ కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని పేర్కొంది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్ పాటించడం లేదని న్యాయవాది అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం జులై 6న భారత్ కు చెందిన వ్యక్తిని తాత్కాలికంగా చీఫ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2021 / 10:02 AM IST
    Follow us on

    భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్ కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని పేర్కొంది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్ పాటించడం లేదని న్యాయవాది అమిత్ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది.

    కొత్త నిబంధనల ప్రకారం జులై 6న భారత్ కు చెందిన వ్యక్తిని తాత్కాలికంగా చీఫ్ కాంప్లియెన్స్ అధికారిగా నియమించామని ట్విటర్ వెల్లడించింది. జులై 11న తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని, ఆ తరువాత నోడల్ కాంటాక్ట్ అధికారిని నియమించనున్నట్లు తెలిపింది. ఈ హోదాల్లో పూర్తిస్థాయి అధికారులను ఎనిమిది వారాల్లోగా నియమిస్తామని చెప్పింది.

    ట్విటర్ వివరణపై స్పందించిన ధర్మాసనం ఈ వివరాలతో కూడిన అఫిడవిట్ ను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని సూచించింది. తాత్కాలికంగా నియమించిన అధికారులు కూడా తమ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అయితే కొత్త చట్టాలను అమలు చేసేందు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం తాము ట్విటర్ కు ఎలాంటి రక్షణ కల్పించలేమని న్యాయస్థానం పేర్కొంది.

    నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది. దీంతో ట్విటర్ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి మరి. ఇప్పటికే కేంద్రంతో ట్విటర్ తో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ట్విటర్ ఖాతాలపై జోక్యం చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం విదితమే.