https://oktelugu.com/

Hi Nanna Teaser: హాయ్ నాన్న టీజర్ రివ్యూ: మృణాల్ తో ముద్దులు లాగించేసిన నాని… ఎమోషనల్ టచ్!

హాయ్ నాన్న చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్ నేడు విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఫీల్ గుడ్ మోడ్ లో సాగింది.

Written By:
  • Shiva
  • , Updated On : October 15, 2023 / 06:53 PM IST

    Hi Nanna Teaser

    Follow us on

    Hi Nanna Teaser: జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి సబ్జెక్స్ ఎంచుకుంటున్నాడు నాని. గ్యాంగ్ లీడర్, జెర్సీ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ, దసరా… ఒక్కో చిత్రం ఒక్కో జోనర్. దసరా వంటి మాస్ కమర్షియల్ హిట్ అనంతరం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయడం సాహసమే. హాయ్ నాన్న అలాంటి చిత్రమే. ఒక పాప, అమ్మాయి చుట్టూ పెనవేసుకున్న అనుబంధాలు ప్రధానంగా హాయ్ నాన్న తెరకెక్కింది. లవ్ ఎమోషనల్ లవ్ డ్రామా.

    హాయ్ నాన్న చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్ నేడు విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఫీల్ గుడ్ మోడ్ లో సాగింది. ఏడేళ్ల పాప నానిని నాన్న అంటుంది. ఆ పాపతో నానికి ఘాడమైన అనుబంధం పెనవేసుకుంది. ఈ తండ్రి కూతుళ్ళ జీవితంలోకి మృణాల్ వస్తుంది. దాంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. ఆ పాప నిజంగా నాని కూతురేనా? మృణాల్ తో నాని ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది సస్పెన్సు..

    ఈ మధ్య తెలుగులో ఫీల్ గుడ్ లవ్ డ్రామాలు తగ్గిపోయాయి. హాయ్ నాన్న ప్యూర్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా హానెస్ట్ గా దర్శకుడు కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక హీరో హీరోయిన్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నాయి. మృణాల్ పెదాలు నాని జుర్రేశాడు. బీజీఎమ్ బాగుంది. హాయ్ నాన్న డిసెంబర్ నెలలో విడుదల కానుంది.

    మలయాళ నటుడు జయరాజ్ కీలక రోల్ చేశాడు. హాయ్ నాన్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. మరి హాయ్ నాన్న చిత్రంతో నాని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. ఆయన గత చిత్రం దసరా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అయితే తెలుగులో మాత్రమే ఆడింది.