https://oktelugu.com/

Payal Rajput: సమంత తర్వాత మరో స్టార్ హీరోయిన్ కు తీవ్ర ఆరోగ్య సమస్య.. ఈ హీరోయిన్లకు ఎందుకిలా?

ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అమ్మడు కొన్ని సినిమాల్లో నటించింది. అయితే రీసెంట్ గా మొదటి సినిమా దర్శకుడే అంటే అజయ్ భూపతితో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 9, 2023 / 10:20 AM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధి గురించి బయటకు వచ్చిన దగ్గర నుంచి మరికొందరు సెలబ్రెటీలు కూడా తమ ఆరోగ్య సమస్యల గురించి బయటపెడుతున్నారు. పూనమ్ కౌర్, సమంత,మమతా మోహన్ దాస్, శృతి హాసన్ ఇలా కొందరు హీరోయిన్ లు ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో బాధపడ్దారు. కొందరికి నయం అయితే మరికొందరు మాత్రం ఇప్పటికీ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇక రీసెంట్ గా ఈ లిస్ట్ లో చేరింది ఆర్ ఎక్స్ 100 బ్యూటీ.

    ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అమ్మడు కొన్ని సినిమాల్లో నటించింది. అయితే రీసెంట్ గా మొదటి సినిమా దర్శకుడే అంటే అజయ్ భూపతితో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. దీంతో అమ్మడుకు అద్భుతమైన రోల్ దొరకిందని అనుకుంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్ర యూనిట్. ఇక పాయల్ కూడా ఇంటర్వ్యూలంటూ విశ్రాంతి లేకుండా సినిమా కోసం కష్టపడుతుందట. ఇందులో భాగంగానే ఆమె పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.

    తనకు మంచి నీళ్లు తాగే అలవాటు చాలా తక్కువగా ఉందని.. అందువల్ల కిడ్నీ సమస్యలు వచ్చాయని తెలిపింది. దీని వల్ల చాలా అవస్థలు పడిందట బ్యూటీ. మీరు నాలాగా చేయకండి. మంచి నీళ్లు బాగా తాగండి, శరీరాన్ని డీ హైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అంటూ నెటిజన్లకు సలహా ఇచ్చింది. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక ఆరోగ్యం గురించే కాదు లవ్ గురించి కూడా తెలిపింది పాయల్. ఈమె చదువుకునే రోజుల్లో ఒకరిని ప్రేమించిందట. అతన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపించేదట. ఒక రోజు ధైర్యం చేసుకొని వెళ్లి ప్రపోజ్ చేస్తే నో చెప్పాడట. అయితే ఈయన ధ్యాసలో ఉంటూ అమ్మడు చదువును నెగ్లెట్ చేసిందట. ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని బాధ పడుతుంటాను అని తన లవ్ మ్యాటర్ ను కూడా పంచుకుంది.

    బిజీ షెడ్యూల్స్, జంక్ ఫుడ్స్, వాతావరణ పరిస్థితులతో ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడంలో హీరోయిన్లు విఫలం అవుతున్నారు. అలాగే అందం కోసం వాడే ప్రాడక్టులు కూడా వారి ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. అందుకే ఈ హీరోయిన్లు వరుసగా అనారోగ్యం పాలవుతున్నారు. ఇక సినిమాలు ఫ్లాప్ అయినా.. ఛాన్సులు రాకున్నా ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడితోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వెరిసి హీరోయిన్లు వరుసగా ఇలా అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో పాయల్ కూడా చేరింది.