https://oktelugu.com/

Hi Nanna Trailer : హాయ్ నాన్న ట్రైలర్ తోనే ఏడిపించేసారు…అసలు ఈ సినిమా కథ ఏంటి అంటే..?

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2023 / 07:11 PM IST
    Follow us on

    Hi Nanna Trailer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిఫరెంట్ కథలను ఎంచుకొని అలాగే కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందే దసరా అనే ఒక సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ని పరిచయం చేశాడు.

    అది అవుట్ అండ్ ఔట్ మాస్ సినిమా అవడంతో నానికి మాస్ సినిమా ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అందరూ ఊహలని తలకిందులు చేస్తూ ఆయన ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు.ఇక ఇప్పుడు హాయ్ నాన్న అనే ఒక క్లాస్ సినిమా తో మనందరినీ పలకరించడానికి వస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి.ఈ ట్రైలర్ ప్రేక్షకుడు ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సెకండ్ కూడా మిస్ అవకుండా చూసేలా ఉంది అంటే ఆ కథలో ఎంత ఇంటెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

    ఇక ట్రైలర్ చూపించిన దాని ప్రకారం కూతుర్ని హ్యాపీగా ఉంచడానికి ఒక నాన్న గా నాని కొన్ని కథలు చెప్తూ ఉంటాడు. కానీ ఏదో ఒక రోజు తన కూతురికి కథ కాకుండా నిజ జీవితాన్ని చెప్పే సిచువేషన్ ని వస్తుంది అప్పుడు అతను దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా ప్లాట్ గా మనకు అర్థం అవుతుంది. ఇక తన వైఫ్ తనని ఎందుకు వదిలేసింది అనేది కూడా ఇందులో క్యూరియాసిటీని రెకెత్తిస్తున్న అంశం…

    ఈ సినిమాతో నాని మరో డిఫరెంట్ అటెంప్ట్ చేశారని మనకు అర్థం అవుతుంది. అలాగే డైరెక్టర్ శౌర్యువ్ కూడా తనదైన రీతిలో సినిమాని మలచినట్టుగా కనిపిస్తుంది.ఈ సినిమాలో ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కూడా కట్టిపడేసినట్టుగా కూడా అర్థం అవుతుంది. ఇక ట్రైలర్ లో నాని చెప్తున్నా అన్ని కథల్లో ప్రియదర్శి కూడా తనతో పాటు ట్రావెల్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్,లవ్ అన్ని కలగలిపి ఫుల్ ప్యాకేజ్ తో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకోబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు…