Pakka Commercial Movie Review: నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు
దర్శకుడు : మారుతి
మ్యూజిక్ : జేక్స్ బెజోయ్
సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా
నిర్మాత : బన్నీ వాసు
విడుదల తేదీ : 1 జులై 2022

హీరో గోపీచంద్ – మారుతి కలయికలో ఈ రోజు రిలీజ్ అయిన “పక్కా కమర్షియల్” సినిమా పరిస్థితి ఏమిటి ?, సినిమా ఎలా ఉంది ?, ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. అసలు ఈ సినిమాలో మ్యాటర్ ఉందా ? లేదా ?, అనే విషయాల కోసం ఈ సినిమా రివ్యూ చూద్దాం రండి.
Also Read: Vishnu Priya Hot Dance : చిట్టి గౌనులో చంపేస్తోన్న విష్ణుప్రియ.. హాట్ డ్యాన్స్ వీడియో వైరల్
కథ :
రామ్ చంద్ (గోపీచంద్) పక్కా కమర్షియల్ లాయర్. లాభం లేకపోతే ఏ పని చేయడు. కానీ.. రామ్ చంద్ తండ్రి (సత్యరాజ్) ఒక సిన్సియర్ జడ్జి. గతంలో ఎన్నో కేసులను నిస్వార్ధంగా వాదించి, న్యాయాన్ని గెలిపించిన వ్యక్తి. జడ్జిగా కూడా సత్యరాజ్ గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడు. ఇలాంటి తండ్రికి స్వార్ధపూరితమైన కొడుకు రామ్ చంద్ పుడతాడు. తండ్రి కొడుకుల అభిప్రాయాలు వేరు. ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. ఐతే, చాలా గ్యాప్ తర్వాత ఒక మిస్టరీ కేసు వల్ల లాయర్ వృత్తిలోకి దిగుతాడు రామ్ చంద్. ఇంతకీ ఆ మిస్టరీ కేసు ఏమిటి ? రామ్ చంద్ దాన్ని ఎలా సాల్వ్ చేశాడు ? అనేది మెయిన్ కథ. ఇక ఈ మధ్యలో సీరియల్ నటి ఝాన్సీ (రాశీ ఖన్నా) ఒక చాలెంజింగ్ లాయర్ రోల్ చేయాల్సి వస్తుంది. అందుకే అసిస్టెంట్ గా గోపీచంద్ దగ్గర జాయిన్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోంది ? చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది ? మిగిలిన కథ.

విశ్లేషణ :
కోర్టు నేపథ్యంలో వచ్చిన ఈ ఎమోషనల్ కామెడీ యాక్షన్ డ్రామాలో గోపీచంద్ పాత్ర చాలా సరదగా సాగింది. తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో గోపీచంద్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మరో కీలక పాత్రలో నటించిన సత్యరాజ్ చాలా సహజంగా నటించాడు. పైగా సినిమాలోనే కీలకమైన తండ్రి పాత్ర అయనది. ఈ పాత్ర ఎమోషన్స్ కూడా బాగా పండాయి.

విలన్ గా నటించిన రావు రమేశ్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో రావు రమేశ్ నటనచాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో గోపీచంద్ నటన చాలా ఎమోషనల్ గా చాలా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన సప్తగిరి తన కామెడీతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలిచాడు.
ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోయిన్ రాశి ఖన్నా తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా నటించింది.
అయితే ఈ పక్కా కమర్షియల్ సినిమాలో కామెడీ ఉంది, కానీ ఆశించిన స్థాయిలో మ్యాటర్ లేదు. కామెడీ కోసం పెట్టిన రెగ్యులర్ ప్లే విసిగిస్తోంది. కానీ.. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా పండాయి. కానీ కొన్ని ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని సీన్స్ సినిమా మైనస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్ నటన,
మారుతి కామెడీ,
టెక్నికల్ వాల్యూస్,
కొన్ని కోర్టు సీన్స్,
మైనస్ పాయింట్స్
సాంగ్స్,
రెగ్యులర్ ప్లే,
రొటీన్ కామెడీ డ్రామా,
లాజిక్స్ మిస్ అవ్వడం,
సినిమా చూడాలా ? వద్దా ?
రొటీన్ కామెడీ యాక్షన్ డ్రామాతో సాగిన ఈ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే గోపీచంద్ నటన అండ్ క్యారెక్టరైజేషన్, అలాగే రాశి ఖన్నా గ్లామర్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే, కేవలం కామెడీ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్ – 2.75 / 5
Also Read:Prabhas: ప్రభాస్.. కొత్త మేకొవర్ తో కుమ్మేశావయ్యా
Recommended Videos


