Social Media Posts : సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్లో పెట్టే పోస్టులు వల్ల జరిగే పరిణామాలకు పెట్టిన వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మహిళా జర్నలిస్టులను హీనంగా చూపిస్తూ, దుర్భాషలాడుతూ, అవమానకరంగా, అసభ్యంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలను ప్రచారం చేశారనే ఆరోపణలపై ఎస్వి శేఖర్ పై 2018లో నమోదైన కేసును కొట్టేయడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. దీనిపై తాజాగా విచారణ చేసిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ తరహా వ్యాఖ్యలు అత్యంత ఇబ్బందికరమైనవిగా ఒక పేర్కొంది. ఈ తరహా పోస్టులు బిల్లు నుండి వదిలిన బాణాలు వంటివని స్పష్టం చేసింది. కాబట్టి ఇటువంటి పోస్టులను పంపినవారు తప్పక బాధ్యులుగా ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఫార్వర్డ్ చేసిన సందేశాలు శాశ్వత సాక్ష్యంగా ఉంటాయని, దాని పర్యవసానాల నుండి బయటపడడం దాదాపు అసాధ్యమని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ అనంతరం స్పష్టం చేశారు.
శేఖర్ ఈ పోస్టులో పెట్టిన రోజునే వాటిని తొలగించి క్షమాపణలు చెప్పాడు. ఆ పోస్టులు అతను ఇంటి ముందు ఆందోళనకు, హింసకు దారి తీసిన విషయాన్ని కోర్టు పేర్కొంది. ఒక పోస్టు పంపిన తర్వాత జరిగిన నష్టానికి సంబంధించిన పరిణామాలకు సదరు వ్యక్తులు పూర్తిగా బాధ్యత తీసుకోవాలని, అదే విషయాన్ని న్యాయమూర్తి ఈ కేసులో గమనించారు.
ప్రాథమికంగా ఐపీసీ లోని సెక్షన్ 504 ప్రకారం దీనిని నేరంగా న్యాయమూర్తి వెంకటేష్ తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఒక వ్యక్తిని అవమానించడం అని న్యాయమూర్తి ఈ కేసులో భావించారు. ఈ కేసు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే.. 2018 ఏప్రిల్ 19న శేఖర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై చెన్నై, కరూర్, తిరునెల్వేలి పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం.