Megastar Chiranjeevi Cancer: మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ భారిన పడినట్టు లేటెస్ట్ గా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది. ఈరోజు నానక్ రామ్ గూడలో నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని మీడియా ముందు పంచుకోగా అది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది.
మెగాస్టార్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురై సోషల్ మీడియా లో మా చిరంజీవి కి ఇంత జరిగిందా అంటూ భయాందోళనతో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో నేను క్యాన్సర్ బారిన పడ్డాను.ముందుగా గుర్తించి చికిత్స తీసుకుని బయటపడ్డాను. క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి భయపడలేదు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ పెద్ద జబ్బు కాదు’ అంటూ మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
తమ అభిమాన హీరోకి చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేని ఫ్యాన్స్, ఒక్కసారిగా చిరంజీవి తనకి గతం లో క్యాన్సర్ వచ్చింది అనే వార్తని తీసుకోలేకపోతున్నారు. సందర్భాన్ని బట్టీ తన వ్యక్తిగత విషయాలను మిగిలిన సమస్యల్లో పెద్దగా బయటపెట్టడానికి ఇష్టం చూపని మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఈ బాంబు పేల్చేసరికి కాస్త అవాక్కు అయ్యారు. ప్రస్తుతం మీ ఆరోగ్యం బాగానే ఉందా, గతం లో లాగానే ఇప్పుడు ఏమైనా దాచారా అంటూ ఫ్యాన్స్ చిరంజీవి ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్దగా ఉండే వ్యక్తి, తనకి క్యాన్సర్ ఉందన్న విషయం ముందుగానే గ్రహించాడు కాబట్టి ఈరోజు సురక్షితంగా ప్రాణాలతో మన ముందు ఉన్నాడు.
అంతే కాదు కరోనా వచ్చిన సమయం లో కూడా ఆయన ఎంతో జాగ్రత్తలు పాటించాడు. తన ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా నియంత్రించడం లో చిరంజీవి సఫలం అయ్యాడు, తనకి తెలిసిన మంచిని నలుగురికి చెప్పి వాళ్ళను అప్రమత్తం చెయ్యడం లో ఎప్పుడూ ముందు ఉండే చిరంజీవి , క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను కూడా ఈ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.