Assembly Election Results 2022: గోవిందా గోవిందా? అన్నట్టుగానే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆశలు.. జాతీయ రాజకీయాలపై అంచనాలు తప్పిపోయాయి. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇక దేశమంతా తిరిగి ఆ పార్టీని కడిగేసి జాతీయ స్థాయిలో నాయకుడిగా చెలామణీ అవుదామని కేసీఆర్ ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. మోడీ ప్రభ తగ్గలేదని.. బీజేపీపై ప్రజల్లో ప్రేమ చావలేదని నిరూపితమైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ముందే అంచనా వేసిన కేసీఆర్ ముందుగానే సర్దుకున్నారని తెలుస్తోంది. బీజేపీ గెలుపు ఖాయం కావడంతోనే తెలంగాణలో ఆ పార్టీకి ఊపు రావద్దని.. బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న యువతను ఉద్యోగాల వైపు మళ్లించినట్టుగా అర్థమవుతోంది.
బీజేపీ ప్రధాన బలం యువతనే. బండి సంజయ్ వెంట పెద్ద ఎత్తున యువత ఉన్నారు. వారే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ లో గెలిపించారు. ఇక రాబోయే 2023 ఎన్నికల్లోనూ యువత టీఆర్ఎస్ ను చావుదెబ్బ తీయడం ఖాయం. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే విజయం అని స్పష్టం చేయడంతో తెలంగాణలో రంకెలేసే బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ ముందే అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద కేసీఆర్ తెలంగాణలో ఏకంగా 90వేల ఉద్యోగాల ప్రకటన చేశారు. యువతను అంతా చదువుల బాట పట్టించారు. రాబోయే రెండేళ్లు వారిని బీజీగా ఉంచేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దూరం చేసి గెలవాలని స్కెచ్ గీశాడు. గత 8 ఏళ్లుగా అస్సలు వాటి గురించి పట్టించుకోని కేసీఆర్ ఇంత సడెన్ గా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వెనుక కూడా బీజేపీ గెలుపే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వేయడానికి యువతను బీజేపీ నుంచి దూరం చేసే ప్రధాన ఏజెండానే కారణం. అంతేకాకుండా టీఆర్ఎస్ పై భగ్గుమంటున్న యువతను శాంతింపచేసి ఉద్యోగాలతో తనవైపు తిప్పుకునే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేశారు. అందుకే ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేశాడని అర్తమవుతోంది.
[…] […]