https://oktelugu.com/

Telugu Heroines: తెలుగు హీరోయిన్ల మరో శకం మొదలైందా? ఈ సారి ఆ విషయం హైలెట్

ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమంది సినిమాలను ఒప్పుకుంది ఈ హీరోయిన్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 29, 2023 / 10:43 AM IST

    Telugu Heroines

    Follow us on

    Telugu Heroines: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోయిన్ లని ఉద్దేశించే అంటూ ఉంటారు. దానికి కారణం లేకపోలేదు. ఒక హీరో దశాబ్దాల కొద్దీ కొనసాగుతూ ఉంటే.. హీరోయిన్లు మాత్రం కేవలం 5 లేదా 6 సంవత్సరాలు మాత్రమే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోగలరు.

    ఇందుకు సరైన ఉదాహరణ చెప్పాలి అంటే శ్రీదేవి నాగేశ్వరరావుకి మనవరాలుగా అలానే హీరోయిన్గా అలానే తల్లిగా నటించి, ఇంకా కూడా నాగేశ్వరరావు హీరోగా చేస్తున్న టైంలోనే తాను హీరోయిన్‌ గా ఫెడ్ అవుట్ అయిపోయింది. అలా ఉంటుంది మన సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల వ్యవహారం.

    ప్రతి ఐదు సంవత్సరాలకి.. లేదా 10 సంవత్సరాలకి ఒక తరం హీరోయిన్ల నుంచి మన తెలుగు ఇండస్ట్రీ మరోతరంకి మారుతూ ఉంటుంది. సావిత్రి తరువాత వాణిశ్రీ, తరువాత శ్రీదేవి.. ఇక అక్కడి నుంచి రమ్యకృష్ణ, సౌందర్య.. తరువాత సిమ్రాన్ తరం కొనసాగుతూ వచ్చింది.

    ఇక 2000 లో శ్రియ, ఆర్తి అగర్వాల్ లాంటివాళ్ళు తెలుగు ఇండస్ట్రీని ఏలారు. ఆ తరువాత కొద్ది సంవత్సరాలకు ఇలియానా, త్రిష ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. ఇక వీళ్ళ హయాం అవ్వగానే సమంత, కాజల్,‌ పూజా హెగ్డే, రష్మిక మందానా లాంటివారు మొన్నటి వరకు కూడా స్టార్ హీరోయిన్స్ గా ఉన్నారు.

    ఇప్పటికీ తెలుగువారు ఈ నలుగురు స్టార్ హీరోయిన్స్ అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల ఆఫర్లు చూస్తూ ఉంటే వీళ్ళ హయాం కూడా అయిపోయి మరో తరం కి మనం అడుగు పెట్టబోతున్నాము అని అర్థమైపోతుంది.

    ఎందుకు అంటే ప్రస్తుతం రష్మిక మందాన, పూజా హెగ్డే సినిమా ఆఫర్లు అన్నీ మిస్ అవుతున్నారు. వీళ్ళ ప్లేసులో నిర్మాతలు మృణాల్ ఠాకూర్, శ్రీ లీల వంటి వారిని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

    ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమంది సినిమాలను ఒప్పుకుంది ఈ హీరోయిన్. ఆమె సినిమాల లిస్టు చూస్తే అసలు ఇన్ని సినిమాలకు ఆమె డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక మృణాల్ కి కూడా ప్రస్తుతం నాని, విజయ దేవరకొండ లాంటి వారితో సినిమా ఆఫర్లు ఉన్నాయి.

    అంతేకాకుండా మన బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కూడా చాలా ఆఫర్లు దక్కించుకునేటట్లే ఉంది. ఇలా మన టాలీవుడ్ మరోసారి ఒక తరం హీరోయిన్ల నుంచి మరో తరం కి మారుతుంది. మార్పు మంచిదే అయితే ఈ మార్పు ఇంకా మంచిగా కనిపిస్తోంది. ఎందుకు అంటే ఈసారి ఈ లిస్టులో శ్రీ లీలా, వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయిలు ఉండడం. చాలా సంవత్సరాల తరువాత ఇలా మన తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతూ ఉండడం తెలుగు ప్రేక్షకులకు ఆనందం కలిగించే విషయం.