Harihara Veeramallu : పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది హరి హర వీరమల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా… ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. హరి హర వీరమల్లు షూటింగ్ అనుకున్నట్లు సాగలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో లాంగ్ షెడ్యూల్స్ హరి హర వీరమల్లు చిత్రానికి కేటాయించలేకపోయారు. అందుకే సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు అవుతున్నా మేజర్ షూటింగ్ పెండింగ్ లోనే ఉంది.
అదే సమయంలో ఇరవై రోజుల్లో వినోదయ సితం రీమేక్ పూర్తి చేశారు. బ్రో టైటిల్ తో ఆ చిత్రం విడుదలైంది. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూట్ కొంత మేర జరిగింది. ఈ క్రమంలో కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. నిర్మాత ఏ ఎం రత్నం ప్రాజెక్ట్ ఆపేశాడట. పవన్ కళ్యాణ్ ని డబ్బులు వెనక్కి ఇచ్చేయమని అడిగారట. దర్శకుడు క్రిష్ సైతం ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని… పుకార్లు రేగాయి.
ఈ నిరాధార కథనాలకు నిర్మాతలు నేడు చెక్ పెట్టారు. హరి హర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో పాటు త్వరలో ప్రోమో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హరి హర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇరాన్, కెనడా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఉన్నత నిర్మాణ విలువలతో భారీ స్కేల్ తో హరి హర వీరమల్లు మీ ముందుకు వస్తుంది. త్వరలో ఒక ప్రోమో విడుదల చేస్తాము… అని ప్రకటన విడుదల చేశారు.
నిర్మాతల ప్రకటన పుకార్లకు చెక్ పెట్టింది. ఇక త్వరలో ప్రోమో అని చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. హరి హర వీరమల్లు మొగలుల కాలం నాటి ఫిక్షనల్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ బందిపోటు రోల్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయని సమాచారం.
https://twitter.com/HHVMFilm/status/1757026887237574993