https://oktelugu.com/

Hanu Man Movie Review : హనుమాన్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఇక జాంబీ రెడ్డి సినిమా తో సక్సెస్ సాధించిన ఈ ఇద్దరు ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించారు..

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2024 / 10:09 PM IST
    Follow us on

    Hanu Man movie First Review : తెలుగు సినిమా స్థాయి అనేది రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. తెలుగు సినిమా స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతూ వస్తున్నాయి. ఇక పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో స్టార్ హీరోలు ఉండటమే కాకుండా స్టార్ డైరెక్టర్లు కూడా వాళ్ల సత్తా చాటుతూ సినిమాలని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించి ఇండియా లో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్ తో శభాష్ అనిపించుకుంటున్నారు. ఇక అదే క్రమంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పటికి ఇవాళ్ల చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశారు.

    ఇక ఈ సినిమాని చూసిన చాలామంది ఈ సినిమా ఫెంటాస్టిక్ గా ఉంది అని చెబుతున్నారు. ఇక బాలీవుడ్ క్రిటిక్ అయిన తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా కి 3.5 రేటింగ్ ఇచ్చారు. ఆయన లాంటి ఒక క్రిటిక్ ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వడం ఇప్పుడు విశేషంగా మారింది. నిజానికి బాలీవుడ్ క్రిటిక్స్ తెలుగు సినిమాలకి పెద్దగా రేటింగ్ అయితే ఇవ్వరు. తెలుగు సినిమాలని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇక ఈ క్రమంలోనే తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమా కి ఇచ్చిన రేటింగ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది….

    అయితే ఈ సినిమాలో హనుమంతు అనే కుర్రాడు హనుమంతుని అనుగ్రహంతో పుట్టి ఆయనకు హనుమంతుడికి ఉండే సూపర్ నేచురల్ పవర్స్ వస్తే ఆయన దాంతో ఏం చేశాడు అనే మెయిన్ కథ తో ఈ సినిమా సాగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ సినిమా ఎక్స్ ఆర్డినరీ గా ఉంది ఇక సెకండ్ హాఫ్ మాత్రం అంతకుమించి ఉందనే చెప్పాలి. చివరి 20 నిమిషాలు అయితే గూస్ బంస్ అనే చెప్పాలి. ఈ సినిమా మీద ప్రేక్షకుడు పెట్టుకున్నా అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని హై రేంజ్ లో తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనకున్న లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా క్వాలిటీని ఎక్కడ తగ్గకుండా భారీ లెవెల్ లో చూపించారు. ఇక ఈ సినిమాలో హనుమంతుడు వచ్చే ఎపిసోడ్ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలువబోతుంది.

    ఇక ఈ సినిమాలో ఉండే ఎలివేషన్స్ ని గాని, ఎమోషన్స్ ని గాని ప్రశాంత్ వర్మ చాలా చక్కగా డీల్ చేశాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తిలేదు. పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అవుతున్న చిన్న సినిమా అవ్వడం వల్ల హనుమాన్ సినిమాకి సింపతి తో పాటు మంచి బజ్ కూడా క్రియేట్ అయింది…నిజానికి.ఈ సినిమా టీజర్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ని క్రియేట్ చేసింది. ఇక మొత్తానికి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలిసి ఈ సంక్రాంతికి ఒక సక్సెస్ ని సాధించారనే చెప్పాలి… ఇక జాంబీ రెడ్డి సినిమా తో సక్సెస్ సాధించిన ఈ ఇద్దరు ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించారు..