Great Resignation: ఆహార సంక్షోభం గురించి విన్నాం. నీటి సంక్షోభం గురించి విన్నాం. ఘోరమైన కరవులను చూశాం. అంతకంటే ఎక్కువ అయిన ప్రకృతి విపత్తులను చూశాం. మరి ఇప్పుడు కొత్తగా ఈ పని సంక్షోభం ఏంటి? దీనివల్ల ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? అసలు పని చేయలేకపోవడం కూడా ఒక సంక్షేభమేనా? టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఏటా 90 వేల మందిని రిక్రూట్ చేసుకుంటోంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా 60 వేలమందికి ఉద్యోగాలు ఇస్తోంది. స్థాయిలో ఉద్యోగాలు ఐటీ లో ఉన్నాయా? ఉద్యోగులు పని చేస్తే.. ఎప్పటి నుంచో సంస్థల్లో పని చేస్తున్న వారు ఏం చేస్తున్నారు? దీనికి సమాధానం సింపుల్. ఉద్యోగం నచ్చిన వారు చేస్తున్నారు. నచ్చని వారు బయటకు వెళ్తున్నారు. గతంలో ఐటి కంపెనీల్లో పింక్ స్లిప్ బెడద ఉండేది. కానీ ఇప్పుడు వైట్ లెటర్ల బెడద ఎక్కువైంది. అందుకే గత్యంతరంలేక కార్పొరేట్ కంపెనీలు గ్రామీణ స్థాయిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల నుంచి కూడా ఉద్యోగార్థుల రిక్రూట్ చేసుకుంటున్నాయి.

గ్రేట్ రెసిగ్నేషన్
పని నైపుణ్యం పెంచాలి. ఉద్యోగం కడుపు నింపాలి. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు అనుసరించే సూత్రం ఇదే. కానీ కొన్ని ఏళ్లుగా దేశంలో కాదు కాదు ప్రపంచంలోనే నైపుణ్య వంతులైన పనిమంతుల సంఖ్య తగ్గిపోతోంది. ఒకవేళ కాస్తోకూస్తో పనిచేసే వారైనా పని వాతావరణాన్ని ఇష్టపడటం లేదు. ప్రపంచీకరణ ఫలితంగా ఇంట్లో ఉండి పని చేయడానికే ఇష్టపడుతున్నారు. కరోనా రెండు దశల్లో చాలావరకు సంస్థలు ఉద్యోగులను పక్కన పెట్టేశాయి. జీతాల్లో అడ్డగోలుగా కోతలు విధించాయి. ఫలితంగా వేతన జీవుల జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. ఫలితంగా గ్రేట్ రెసిగ్నషన్ అనే ఉద్యమం మొదలైంది. వల్ల అమెరికా, బ్రిటన్, ఏసియా పసిఫిక్ దేశాల్లో చాలామంది స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నారు. ఇందుకు కారణం పని వాతావరణం నచ్చకపోవటం, ఊపిరి సలపని ఒత్తిడి, కంపెనీలు విధిస్తున్న టార్గెట్లు, సంస్థల్లో గాసిప్పులు.. ఇవన్నీ కూడా ఉద్యోగులను పనిచేయకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఉద్యోగులు తమ పనుల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటున్నారు. బయటకు వచ్చి ఇతర వ్యాపకాలను చూసుకుంటున్నారు.
Also Read: Maharashtra Crisis: పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం.. అమ్ముడు పోతున్న ఎమ్మెల్యేలు..!
అవకాశాలు పెరిగాయి
ప్రపంచవ్యాప్తంగా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నది ఐటీ, మీడియా, పరిశ్రమలు. కానీ వీటిల్లో 9 శాతం మంది మాత్రమే సంతృప్తి గా పనిచేస్తున్నారు. 42 శాతం మంది బయటకు వెళ్తున్నారు. 49 శాతం మంది వేరే అవకాశం రాగానే వెళ్ళిపోతున్నారు. దీనివల్ల పని నాణ్యత తగ్గుతోంది. నైపుణ్య వంతుల కొరత ఏర్పడుతోంది. అంతిమంగా డిమాండ్ పెరుగుతుండడంతో సప్లై తగ్గుతుండటంతో అందిస్తున్న సేవల్లో నాణ్యత కొరవడుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా బయట అవకాశాలు చాలా విస్తృతం అవడంతో ఏ ఒక్కరు తాము చేస్తున్న పని పైన అంత సంతృప్తిగా లేరు. చదివిన చదువు ఒకటైతే.. కొలువు ఇంకోటి చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంటర్ప్రెన్యూర్ ల సంఖ్య పెరిగింది. వైవిధ్య పరమైన స్టార్టప్ల సంఖ్య కూడా పెరిగింది. యూట్యూబ్ వ్లాగర్స్ అని, ఫుడీలని, ట్రావెలర్ లని… ఇలా కొత్త కొత్త మనుషులు పుట్టుకొచ్చారు. ఇదే దరిమిలా పనిని ఆసక్తిగా చేసేవారు కరువై, పనిని ఇష్టం వచ్చినట్టు చేసేవారు ఎక్కువయ్యారు. కొవిడ్ వల్ల మీడియాలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో గతకాలపు నైపుణ్యం వల్ల వేరే వేరే మాధ్యమాల ద్వారా జనాలకు చేరువవుతున్నారు.

బయట తిండికే జై
గ్రేట్ రెసిగ్నషన్ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువత జై కొడుతున్నారు. ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చక ముందే ప్రాచ్య దేశాలు అక్కడ ఉన్న కార్మిక చట్టాలను మార్చే పనిలో ఉన్నాయి. మరోవైపు ఈతరం పని ఎలాగైతే ఇష్టమొచ్చినట్లు చేస్తోందో.. తినే తిండిని కూడా అలానే కానిస్తుంది. బయట తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది. అందుకే గతంలో భారతదేశానికి సంబంధించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లెక్కల ప్రకారం హోటల్ వ్యాపారం లక్ష కోట్ల రూపాయల వరకు సాగేది. కోవిడ్ తర్వాత ఇప్పుడు అది సుమారు రెండున్నర లక్షల కోట్లను దాటింది. ఇక చిన్నాచితక హోటళ్లను కలుపుకుంటే అది ఒక లక్ష కోట్లు దాటవచ్చు. సంపాదన పెరగడంతో కట్ చేయడానికి కూడా యువత అస్సలు వెనకాడటం లేదు. ఖర్చు చేసే వెసులుబాటు ఉన్న మధ్యవయస్కులు డబ్బులు పొదుపు చేస్తున్నారు. ఇందుకు కారణం పిల్లలు, ఇల్లు, వారి చదువులు, సేవింగ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటి పై ఎక్కువ శాతం వెచ్చిస్తున్నారు.

ప్రభుత్వాలు ఏం చేయలేవా?
గత కొంతకాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన దారుణంగా పడిపోయింది. ఇదే స్థాయిలో కార్పొరేట్ కంపెనీల పెత్తనం ఎక్కువైంది. ప్రభుత్వాలు కూడా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తుండంతో యువత గత్యంతరం లేక ప్రైవేటు కంపెనీలకు మళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. ఇది నచ్చని కొంతమంది యువత సొంత వ్యాపకాలను చూసుకుంటున్నారు. ఇంకొందరు ఇతర వ్యాపారాల వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వాలు ఇలానే చూస్తూ ఉంటే పని సంక్షోభం మరింత ముదురుతుంది. నాణ్యమైన సేవలు అందక కంపెనీ లాభాలు తగ్గుతాయి. ఉన్న ఉద్యోగులకు సరైన జీతభత్యాలు అందక రోడ్డున పడతారు. ప్రభుత్వాలకు సరైన ఆదాయం రాక వివిధ పథకాల్లో దారుణమైన కోతలు పడతాయి. అంతిమంగా ఇది మనుషుల జీవన ప్రమాణాల మీద, అభివృద్ధి మీద అ ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కాళోజి చెప్పినట్టు ఆకలి ఒకచోట, అన్నం రాశులు ఒకచోట.. పని ఒక చోట పనిమంతులు ఇంకొక చోట ఉండకూడదు.
Also Read:KCR National Party: బీజేపీతో ఇప్పుడే వద్దు.. కేసీఆర్ జాతీయ పార్టీ గోవిందా..!