Google’s ‘DG Kavach’ : ఆన్‌లైన్‌ మోసాలకు ఇక చెక్‌.. రక్షణ కల్పించే గూగుల్‌ ‘డిజి కవచ్‌’

ఢిల్లీలో జరిగిన తన వార్షిక గూగుల్‌ ఫర్‌ ఇండియా ఈవెంట్‌ తొమ్మిదో ఎడిషన్‌ గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ టెక్‌ దిగ్గజం డిజీ కవచ్‌ను ప్రకటించింది. మోసాల నుంచి కాపాడేందుకు ఈ డిజీ కవచ్‌ అని సంస్థ తెలిపింది.

Written By: NARESH, Updated On : October 20, 2023 11:11 am
Follow us on

Google’s ‘DG Kavach’ : ఈ మధ్యకాలంలో డిజిటల్‌ ట్రాన్‌జాక్షన్స్‌ పెరిగాయి. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కే చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బులు క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా పేమెంట్స్‌ జరుగుతున్నాయి. అదే సమయంలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. వినూత్న, సృనాత్మక పద్ధతుల్లో స్కామర్స్‌ మోసాలు చేసి ప్రజల నుంచి డబ్బులు లాగేస్తున్నారు. టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు కూడా సైబర్‌ మోసాలబారిన పడుతున్నారు. ఇక గ్రామీణుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగా విషయాలు, ఓటీపీలు ఎవరీకి చెప్పొద్దని పోలీసులు, ఇటు బ్యాంకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు పరిచయం లేని కాల్స్‌కు స్పందించొద్దని, అత్యాశకుపోయి ఫోన్లకు వచ్చే లింక్స్‌ క్లిచ్‌ చేయొద్దని కూడా సూచిస్తున్నారు. కానీ నిరక్షరాస్యులు తెలియక క్లిక్‌ చేస్తున్నారనుకుంటే.. టెక్నాలజీపై మంచి పట్టు ఉన్నవారు కూడా ఏమరుపాటున, అత్యాశకుపోయి లింక్స్‌ క్లిక్‌ చేస్తూ సైబర్‌ మోసాలబారిన పడుతున్నారు. ఇలాంటి మోసాలను నిరోధించే లక్ష్యంతో గూగుల్‌ ‘డిజీ కవచ్‌’ను లాంచ్‌ చేసింది. ఢిల్లీలో జరిగిన తన వార్షిక గూగుల్‌ ఫర్‌ ఇండియా ఈవెంట్‌ తొమ్మిదో ఎడిషన్‌ గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ టెక్‌ దిగ్గజం డిజీ కవచ్‌ను ప్రకటించింది. మోసాల నుంచి కాపాడేందుకు ఈ డిజీ కవచ్‌ అని సంస్థ తెలిపింది.

ఏమిటీ డిజి కవచ్‌?
ఆన్‌లైన్‌ మోసాల నుంచి భారతీయులను కాపాడే ఉద్దేశంతో ‘డిజి కవచ్‌’ పేరుతో గూగుల్‌ ఒక ప్రోడక్ట్‌ను రూపొందించింది. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా 2023’ కార్యక్రమం గురువారం న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో గూగుల్‌ సంస్థకు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ తమ లేటెస్ట్‌ ప్రొడక్ట్స్‌ని, వాటి ఉపయోగాలను వివరించారు. అందులో ప్రధానంగాఈ డిజీ కవచ్‌ గురించి తెలిపారు. ఆన్‌లైన్‌ మోసాల నుంచి డిజి కవచ్‌ భారతీయ యూజర్స్‌ను ఎలా కాపాడుతుందో వారు వివరించారు. ప్రస్తుతానికి భారత్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. త్వరలో వేరే దేశాలకు కూడా విస్తరిస్తామని గూగుల్‌ ప్రతినిధులు చెప్పారు.

ఎలా పనిచేస్తుందంటే..
దాదాపు 100 కోట్లకు పైగా ఉన్న భారతీయులు ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ‘డిజి కవచ్‌’ ను రూపొందించామని గూగుల్‌ హెడ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ సైకత్‌ మిత్రా తెలిపారు. సామాన్యులు కూడా సులువుగా ఉపయోగించేలా ఈ టూల్‌ని రూపొందించామని తెలిపారు. కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ సహాయంతో డిజీ కవచ్‌ పనిచేస్తుందని వివరించారు. స్కామర్స్‌ లేదా ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఎలా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారనే విషయంపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత డిజీ కవచ్‌ ను రూపొందించామని తెలిపారు.

మోసగాళ్ల లాగే ఆలోచించి..
ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఎలా ఆలోచిస్తారో, ఏ విధంగా మోసం చేస్తారో, భవిష్యత్తులో ఏ తరహా మోసాలకు పాల్పడే అవకాశం ఉందో ముందుగా అధ్యయనం చేశామని గూగుల్‌ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ డిజీ కవచ్‌ ను ప్రధానంగా ఆర్థికపరమైన మోసాల నుంచి తప్పించే లక్ష్యంతో రూపొందించామన్నారు. ఆర్‌బీఐతో, ఎన్పీసీఐతో చర్చలు జరుగుతున్నాయని, వారి భాగస్వామ్యంతో డిజీ కవచ్‌ను అమలు చేస్తామని గూగుల్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ టూల్‌ను ప్రయోగాత్మకంగా వాడి సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. గూగుల్‌ పే యాప్‌పై ఈ డిజీ కవచ్‌ను ఉపయోగించడం ద్వారా దాదాపు 12 వేల కోట్ల రూపాయలను స్కామర్స్‌ బారిన పడకుండా కాపాడమన్నారు. అయితే, ఈ డిజీ కవచ్‌ను ఎప్పుడు లాంచ్‌ చేస్తారో గూగుల్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

డిజీ కవచ్‌ గురించి ఇంకా..

1. డిజీ కవచ్‌ అనేది ముందస్తు ముప్పును గుర్తించే హెచ్చరిక వ్యవస్థ. ఇది విస్తృతమైన హాని కలిగించే ముందు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక మోసాల నమూనాలను గుర్తించడానికి, అధ్యయనం చేయడానికి రూపొందించబడిన టూల్‌.

2. దీని కింద, దాని బృందాలు ముందుగా స్కామర్‌ల పద్ధతులు, కార్యనిర్వహణ పద్ధతిని అధ్యయనం చేస్తాయి. బెదిరింపులను ముందుగానే గుర్తిస్తాయి.

3. చివరగా, అంతర్‌దృష్టితో ప్రభావవంతంగా పంచుకోవడానికి బృందాలు విస్తృత పర్యావరణ వ్యవస్థ’తో సహకరిస్తాయి.

4. చొరవ కోసం, మౌంటైన్‌ వ్యూ, కాలిఫోర్నియా–ప్రధాన కార్యాలయ సాంకేతిక సంస్థ ఫిన్‌ టెక్‌ అసోసియేషన్‌ ఫర్‌ కన్జ్యూమర్స్ పవర్‌మెంట్‌తో సహకరిస్తోంది. రెండోది సంభావ్య బెదిరింపులను ‘ప్రాధాన్యతపై’ ఫ్లాగ్‌ చేస్తుంది.

5. ఈ టూల్‌ ప్లే స్టోర్‌లో దోపిడీ డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌లను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది.