Google : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు రూ.6 కోట్ల వేతనం.. ఉద్యోగం అంటే అట్లుంటది.. జీతాల లెక్కలు లీక్‌!

గూగుల్‌ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల అత్యధికంగా సంపాదిస్తున్నారు. వారికి రూ. 6 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 21, 2023 7:08 pm
Follow us on

Google : ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌. ఇందులో ఉద్యోగం రావాలని చాలా మంది ప్రయత్నిస్తారు. రెఫరెన్స్‌లు చేయించుకుంటారు. గూగుల్‌లో జాబ్‌ కొడితే లైఫ్‌లో సెటిల్‌ అయిపోయినట్లు అంటుంటారు. అలా ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది. అందులో పని చేస్తున్న ఉద్యోగుల జీతాల వివరాలు లీక్‌ అయ్యాయి. గూగుల్‌ సంస్థలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల అత్యధికంగా సంపాదిస్తున్నారు. వారికి రూ. 6 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నారు. మరి మిగతా ఉద్యోగులకు ఏ విధంగా జీతాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సగటు ఉద్యోగి కల.. 

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం చేయాలనేది సగటు ఐటీ ఉద్యోగి కల. గూగుల్‌ సంస్థ తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు కోట్లలో జీతాలు ఇస్తోంది. గూగుల్‌లో పనిచేసే వారికి నెలకు రూ.లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్‌ ఉంటుందనే కారణంగానే చాలా మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పోటీ పడుతుంటారు. గూగుల్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆ విషయం మరోసారి వెల్లడైంది. 2022లో గూగుల్‌ ఉద్యోగుల సగటు వేతనం 279,802 అమెరికన్‌ డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో ఆ విలువ రూ.2.30 కోట్లు) అని అమెరికాకు చెందిన బిజినెస్‌ ఇ¯Œ సైడర్‌ అనే వెబ్‌సైట్‌ లీక్‌ చేసింది. గూగుల్‌లో పని చేస్తున్న వారి జీతాల వివరాలను బహిర్గతం చేసింది.
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకే ఎక్కువ జీతం..
గూగుల్‌లో అత్యధిక జీతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే తీసుకుంటున్నారు. వారికి సగటున రూ.5.90 కోట్లు శాలరీ ఉందని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. వారి తర్వాత అత్యధిక జీతం తీసుకుంటున్నది బిజినెస్‌ అనలిస్టులు, సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. 2022 ఏడాదికి సంబంధించి గూగుల్‌లోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు తీసుకుంటున్న వార్షిక వేతనాల వివరాలను బహిర్గతం చేసింది. ఆ జాబితాను పరిశీలిద్దాం.
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు– రూ.5.90 కోట్లు
ఇంజినీరింగ్‌ మేనేజర్‌– రూ.3.28 కోట్లు
ఎంటర్‌ ప్రైజెస్‌ డైరెక్ట్‌ సేల్స్‌ – రూ.3.09 కోట్లు
లీగల్‌ కార్పొరేట్‌ కౌన్సెల్‌– రూ. 2.62 కోట్లు
సేల్స్‌ స్ట్రాటజీ– రూ. 2.62 కోట్లు
ప్రభుత్వ వ్యవహారాలు అండ్‌ పబ్లిక్‌ పాలసీ– రూ. 2.56 కోట్లు
రీసెర్చ్‌ సైంటిస్ట్‌– రూ. 2.53 కోట్లు
క్లౌడ్‌ సేల్స్‌– రూ.2.47 కోట్లు
ప్రోగ్రామ్‌ మేనేజర్‌– రూ. 2.46 కోట్లు
మెటా టాప్‌.. 
వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనం ప్రకారం 2022లో 3 లక్షల అమెరికా డాలర్లు అంటే రూ.2.45 కోట్లు సగటు వేతనం ఇచ్చే కంపెనీగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా నిలిచింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 2,80,000 డాలర్లు అంటే రూ. 2.30 కోట్లు సగటు వేతనాలు ఇస్తూ 3వ స్థానంలో ఉంది. భారత్‌లో చూసుకుంటే తమిళనాడుకు చెందిన సి.విజయ్‌ కూమార్‌ అనే వ్యక్తి రోజుకు ఏకంగా రూ.36 లక్షలు సంపాదిస్తున్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆయన దేశంలోనే రోజుకు అత్యధిక జీతం పొందుతున్న ఉద్యోగిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ టెక్‌ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్లో సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.