https://oktelugu.com/

Good Night Movie Review : గుడ్ నైట్ మూవీ రివ్యూ.. ఏం కాన్సెప్ట్ రా బాబూ.. ఇలా కూడా సినిమాలు తీస్తారా?

ఇక ఈ సినిమా కి ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఈ సినిమా లో ఎంత సేపు గురక ఒక్కదాని మీదే ఫోకస్ చేశారు. అది కాకుండా మిగితా ఇంకో సబ్ ప్లాట్ ఏదైనా ఉంటే బాగుండేది. దానికి మించిన మైనస్ పాయింట్స్ ఏమి లేవు ...

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2023 / 12:09 PM IST

    Good Night Movie Review

    Follow us on

    Good Night Movie Review : ఈ రోజుల్లో ఒక సినిమాని తీసి సక్సెస్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది.ఇక ఈ సినిమాలో కథ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పడానికి రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక భారీ సినిమాలు చేయాలి అలాగైతేనే సినిమాలు సక్సెస్ అవుతాయని అనుకునే రోజులు మారిపోయాయి. ఒక మంచి కాన్సెప్ట్ ఉంటే దానితో చిన్న కెమెరా తీసుకొని సినిమా తీసి హిట్లు అందుకుంటున్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి కోవ కి చెందిన సినిమానే గుడ్ నైట్ సినిమా…

    ఈ సినిమా తమిళ్ సినిమా అయిన కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో ఉన్న కామన్ పాయింట్ గురక అవ్వడం వల్ల ఈ సినిమా అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది… అయితే ఈ సినిమాలో మెయిన్ స్టోరీ ఏంటి అంటే ఒక వ్యక్తి కి గురుక ఉండడం వల్ల ఇబ్బందులు ఏంటి అనేది చూపిస్తూనే కొంచెం ఎమోషనల్ టచ్ ఇస్తు ఈ సినిమా తీయడం లో డైరెక్టర్ 100% సక్సెస్ చేసాడనే చెప్పాలి…ఇక ఒకసారి కథలోకి వెళ్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన మోహన్ కి గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఆ గురక వల్ల ఇంట్లో వారితో పాటు పక్కింట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక అను అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన తర్వాత ఈ గురక వల్ల ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి దానివల్ల ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలా క్లియర్ గా ఈ సినిమాలో చూపించడం జరిగింది…

    ఇక మెయిన్ లీడ్ లో నటించడం మోహన్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చాలా అద్భుతంగా పోషించాడు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అనేది చాలా క్లియర్ గా ఎక్స్ ప్రేషన్ తో గురక వల్ల ఇబ్బందులు ఏంటి అనేది మన కండ్ల కి కట్టినట్టుగా చూపించాడు. ఇలాంటి ఒక సినిమాను తీసి హిట్ కొట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గుడ్ నైట్ సినిమాని తీసి డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్ మంచి విజయాన్ని అందుకున్నారు.గురక అనేది ప్రతి ఒక్కరికీ కామన్ పాయింట్ అవ్వడం వల్ల భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి ని ఆకట్టుకుంది.

    ఇక ఈ సినిమా లో ఒక సెన్స్తివ్ మ్యాటర్ ని చాలా బాగా డీల్ చేసి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అలాగే ఆర్టిస్ట్ లు అందరూ కూడా చాలా బాగా నటించారు

    ఈ సినిమా కి ప్లస్ పాయింట్స్ అంటే హీరో మనికందన్ నటన, స్టోరీ, డైరెక్షన్ అనే చెప్పాలి…

    ఇక ఈ సినిమా కి ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఈ సినిమా లో ఎంత సేపు గురక ఒక్కదాని మీదే ఫోకస్ చేశారు. అది కాకుండా మిగితా ఇంకో సబ్ ప్లాట్ ఏదైనా ఉంటే బాగుండేది. దానికి మించిన మైనస్ పాయింట్స్ ఏమి లేవు …

    ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3/5