Gaami Trailer : టాలీవుడ్ లో నయా దర్శకులు సత్తా చాటుతున్నారు. భిన్నమైన సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నారు. నేడు విడుదలైన గామి ట్రైలర్ చూస్తే దర్శకుడు విద్యాధర్ కాగిత వద్ద చాలా మేటర్ ఉన్నట్లు అనిపిస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా ఆయన గామి తెరకెక్కించాడు. టైటిల్ తోనే మూవీ మీద ఆసక్తి క్రియేట్ చేశారు. ఇక ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఒక విభిన్నమైన చిత్రాన్ని చూడబోతున్నాం అనే ఆలోచన కలిగేలా చేసింది. దాదాపు నాలుగు నిమిషాల లాంగ్ ట్రైలర్ అద్భుతంగా సాగింది.
గామి ట్రైలర్ కట్ లో కథ గురించి ప్రేక్షకుడికి హింట్ ఇస్తూనే సస్పెన్సు అంశాలు జోడించారు. విశ్వక్ సేన్ కెరీర్లో మొదటిసారి అఘోర పాత్ర చేస్తున్నాడు. అఘోర అయిన విశ్వక్ సేన్ ఒక వింత రోగంతో బాధపడుతూ ఉంటాడు. అతడు మరొక వ్యక్తిని తాక కూడదు. అలా తాకితే అతడు అనారోగ్యానికి గురి అవుతాడు. దీనికి పరిష్కారం హిమాలయాల్లో ఉంటుంది. 36 ఏళ్ల కు ఒకసారి పూచే మహిమ గల పుష్పాల కోసం విశ్వక్ బయలుదేరుతాడు.
అరుదైన వ్యాధితో బాధపడుతూ కఠిన పరిస్థితుల మధ్య తన లక్ష్యం ఎలా చేరుకున్నాడు అనేది కథ. ఈ కథలో శాస్త్రీయ ప్రయోగాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలు కూడా చూపించారు. విశ్వక్ సేన్ ఎవరు అనేది? కథలో అసలు ట్విస్ట్. విజువల్స్ హాలీవుడ్ మూవీని తలపిస్తున్నాయి. సాంకేతిక విలువలు బాగున్నాయి. చాందిని చౌదరి హీరోయిన్ రోల్ చేసింది. విశ్వక్ సేన్ తో పాటు ఆమె సాహస యాత్ర చేస్తుంది.
మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ కలుగుతున్నాయి. విశ్వక్ సేన్ కి మంచి మూవీ పడింది. గామి మూవీ మార్చి 8న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. వి సెల్యులాయిడ్ బ్యానర్ పై నిర్మించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించాడు. విశ్వక్ సేన్ ప్రతి సినిమా ఓ ప్రయోగం లా చేస్తున్నాడు. ఫలితం మాత్రం దక్కడం లేదు. గామితో ఆయన హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం కలదు. మరి చూడాలి గామి విశ్వక్ సేన్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో..