https://oktelugu.com/

Fertility rate : దేశంలో సంతానోత్పత్తి రేటు తిరోగమనం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

దీనివల్ల నగర ప్రాంతాల్లో జననాల సంఖ్య తగ్గుతోంది. బీహార్, మేఘాలయ, జార్ఖండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో మాత్రమే సంతానోత్పత్తి రేటు జనాభా భర్తీ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంటుంది

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2024 / 08:13 PM IST

    indias-fertility-rate-drops-from

    Follow us on

    Fertility rate : మొన్ననే కదా జనాభా విషయంలో మన దేశం చైనాను దాటింది.. జనాభా విషయంలో అతి పెద్ద దేశంగా అవతరించింది. కానీ ఇంతలోనే షాకింగ్ విషయం తెలిసింది. లాన్సెట్ జర్నల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం మనదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందట. 1950లో మనదేశంలో ఫెర్టిలిటీ రేటు 6.2 గా ఉండేది. 2021 నాటికి అది రెండు కంటే తక్కువకు పడిపోయింది. 1950లో మహిళల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు 4.5 కంటే ఎక్కువ ఉండేది. కానీ అది 2021 నాటికి 2.2 కి తగ్గింది. సంతానోత్పత్తి రేటు 2050లో 1.29 కి, 2,100 నాటికి 1.4 కి పడిపోవచ్చని అంచనా వేసింది. అయితే ఆ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిసాయి.

    వాస్తవానికి మనదేశంలో జనాభా పెరిగిపోతోందనే భావన ఉన్నది. అయితే గత కొంతకాలంగా సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతుంది. 2019-21 లెక్కల ప్రకారం.. ఒక మహిళకు ఇద్దరు పిల్లలుగా కానిష్ట స్థాయికి సంతానోత్పత్తి తగ్గింది. వాస్తవానికి సంతానోత్పత్తి రేటు 2.1 శాతం ఉంటేనే జనాభా స్థిరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి సందర్భంలో జననాలు మరణలను భర్తీ చేస్తాయి. దీనినే జనాభా భర్తీ రేటు అంటారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు శిక్షార్హులని ప్రకటించింది. అది అక్కడ పెద్ద వివాదానికి దారి తీసింది. అంతటి ఉత్తర్ ప్రదేశ్ లో కూడా సంతానోత్పత్తి రేటు 2.4 కు పడిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.. వాస్తవానికి మనదేశంలో జనాభా భర్తీ మార్క్ కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న రాష్ట్రాలు కేవలం ఐదు మాత్రమే. వీటిలో ఉత్తర ప్రదేశ్ ఒకటి.

    1992-93 లో మనదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు 3.7 శాతం గా ఉంది. పట్టణాల్లో 2.7 గా నమోదయింది. 30 ఏళ్ల కాలంలో ఈ తేడా 0.5 శాతానికి తగ్గిపోయింది. ఆరోగ్య పరిరక్షణ విస్తరిస్తున్నప్పటికీ జనాభా పెరగడం లేదు. బాల్య వివాహాల్ని అరికట్టడం, టీనేజ్ వయసులో గర్భధారణను నిరోధించడం, కుటుంబ నియంత్రణ విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది.

    వైద్య శాఖ లెక్కల ప్రకారం 20 నుంచి 24 ఏళ్ల వయసు నుంచి 25 నుంచి 29 వయసు వారిలో గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వారిలో కూడా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 15 నుంచి 19 సంవత్సరాల యువతులలో గర్భధారణ దాదాపుగా తగ్గిపోయింది. 2011లో సగటు గర్భధారణ వయసు 26.5 సంవత్సరాలు కాగా, 2018 నాటికి అది 28.4 సంవత్సరాలకు పెరిగింది.. చదువు, కెరియర్, ఉద్యోగం.. వంటి కారణంగా నగర ప్రాంతాలలో వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 18.1 సంవత్సరాలకు వివాహాలవుతుంటే.. నగర ప్రాంతాలలో 19.8 సంవత్సరాలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 30 సంవత్సరాల అనంతర వయసులో మహిళలు గర్భం దాల్చడం ఇటీవల పెరుగుతోంది. దీనివల్ల నగర ప్రాంతాల్లో జననాల సంఖ్య తగ్గుతోంది. బీహార్, మేఘాలయ, జార్ఖండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో మాత్రమే సంతానోత్పత్తి రేటు జనాభా భర్తీ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంటుంది.