https://oktelugu.com/

Cricket : క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో క్రికెట్ ఆడిన తండ్రి కొడుకులు వీళ్లే..

కెట్ హిస్టరీ లో ఇప్పటివరకు ఆడిన తండ్రి కొడుకులు ఎవరో ఒకసారి మనము తెలుసుకుందాం...

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2023 / 08:05 PM IST
    Follow us on

    Cricket : ప్రపంచ క్రికెట్ చరిత్రలోచాలా మంది ప్లేయర్లు ఎన్నో గొప్ప గొప్ప విజయాలను అందుకున్నారు అయితే క్రికెట్ హిస్టరీ లో ఇప్పటివరకు ఆడిన తండ్రి కొడుకులు ఎవరో ఒకసారి మనము తెలుసుకుందాం…

    ముందుగా మన ఇండియా టీం ని కనక చూసుకుంటే విజయ్ మంజ్రేకర్,సంజయ్ మంజ్రేకర్ ఇద్దరు కూడా ఇండియన్ క్రికెట్ కి చాలా సేవలని అందించారని చెప్పాలి. అయితే సంజెయ్ మంజ్రేకర్ ఇండియా తరుపున 1951 లో తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు ఇక ఈయన ఇండియా తరుపున మొత్తం 55 టెస్ట్ మ్యాచ్ లు అడగా అందులో 3208 రన్స్ చేసాడు.

    ఇక సంజయ్ మంజ్రేకర్ 1987 వ సంవత్సరం లో తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు.ఇక తన కెరియర్ లో మొత్తంగా టెస్టులు, వన్డే లు కలిపి 111 మ్యాచులు ఆడగా అందులో 4037 రన్స్ చేసాడు…

    సునీల్ గవాస్కర్, రోహన్ గవాస్కర్
    వీళ్లిద్దరు కూడా ఇండియా తరుపున టెస్ట్ లు వన్డేలు ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…
    నిజానికి సునీల్ గవాస్కర్ ఇండియా టీం కి దొరికిన ఒక గొప్ప ప్లేయర్ అనే చెప్పాలి. గవాస్కర్ టెస్ట్ ఫార్మాట్ లో 10000 పరుగులు చేసిన మొదటి బ్యాట్సమెన్ గా హిస్టరీ లో నిలిచాడు…మొత్తంగా సునీల్ గవాస్కర్ 233 మ్యాచులు అడగా అందులో 13214 పరుగులు చేసాడు…

    ఇక అతని కొడుకు అయిన రోహన్ గవాస్కర్ కూడా టెస్ట్ లు, వన్డేల్లో కలిసి 11 మ్యాచులు మాత్రమే ఆడాడు.అందులో కేవలం 151 పరుగులు మాత్రమే చేసాడు… నిజానికి రోహన్ గవాస్కర్ పెద్దగా సక్సెస్ కాలేదు కానీ సునీల్ గవాస్కర్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి…

    ఇక వీళ్ల తర్వాత మనం చెప్పుకునే ప్లేయర్లు యోగరాజ్ సింగ్, యువరాజ్ సింగ్…
    ఇండియా తరుపున క్రికెట్ ఆడిన యోగరాజ్ సింగ్ ఫాస్ట్ బౌలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి ఈయన ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా చాలా మంచి బౌలింగ్ చేసి ఇండియా టీం కి తన వంతు సహాయం అయితే అందించాడు…ఇక ఈయన ఎంటైర్ కెరియర్ లో 1 టెస్ట్ మ్యాచ్ 6 వన్డేలు మాత్రమే ఆడాడు…అందులో 5 వికెట్లు మాత్రమే తీసాడు అయితే ఈయన ఎంటైర్ క్రికెట్ కెరియర్ లో ఈయన పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు…

    అయితే తన కొడుకు అయిన యువరాజ్ సింగ్ ని క్రికెటర్ గా మార్చాలనుకొని చిన్నప్పటి నుచి తనకి క్రికెట్ మీద ఇష్టం పెరిగేలా చేసాడు.మొదట యోగరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ ని ఫాస్ట్ బౌలర్ చేద్దాం అనుకున్నాడు కానీ యువరాజ్ మాత్రం తన బ్యాట్ తో అందరికి సమాధానం చెప్పి సూపర్ బ్యాట్సమెన్ గా ఎదిగాడు…ఇండియా కి చాలా మ్యాచుల్లో విజయాలను అందించాడు ముఖ్యంగా నెంబర్ ఫోర్ లో ఆడి ఇండియా కి ఘన మైన విజయాలని అందించాడు.ఇక ఈయన వల్లే 2011 వన్డే వరల్డ్ కప్ ఇండియా టీం గెలిచింది.ఆ మ్యాచుల్లో ఈయన పాత్ర చాలా వరకు ఉంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.అలాగే యువరాజ్ మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచులు ఆడి 11778 రన్స్ చేసాడు ఇక తన బౌలింగ్ తో 148 వికెట్లు కూడా తీసుకున్నాడు…యోగరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ ని ఎలా అయితే చూడాలి అని అనుకున్నాడో అంతకు మించి యువరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్ టీం లో తన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు…

    రోజారీ బిన్నీ, స్టువర్ట్ బిన్నీ
    ఈ ఇద్దరుకూడా ఆల్ రౌండర్లు గా ఇండియా టీం కి వాళ్ల వంతు సహాయం అయితే అందించారు. ముఖ్యంగా రోజారీ బిన్నీ గురించి చూసుకుంటే ఈయన 1979 వ సంవత్సరం లో ఇండియా టీం తరుపున తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ని ఆడాడు. ఇక టీంలో చాలా మంచి బౌలర్ గా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు ముఖ్యంగా 1983 లో జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా టీం గెలవడం లో చాలా కీలక పాత్ర వహించాడు.వరల్డ్ కప్ లో 8 మ్యాచులు ఆడితే అందులో 18 వికెట్లు తీసి ఇండియా టీం వరల్డ్ కప్ గెలవడం లో తన పాత్ర తాను పోషించాడు…ఇక ఆ వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలవడమే కాకుండా గోల్డెన్ బాల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఇక ఈయన మొత్తం 99 మ్యాచులు ఆడితే అందులో 1459 పరుగులు చేసాడు అందులో 124 వికెట్లు కూడా తీసాడు…

    ఇక ఈయన కొడుకు అయిన స్టువర్ట్ బిన్నీ కూడా ఇండియా టీం కి మ్యాచులు ఆడాడు.ముఖ్యంగా ఆయన 2014 వ సంవత్సరం లో బంగ్లాదేశ్ మీద ఆడిన మ్యాచులో 4 .4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు…ఇక ఇప్పటికి అదే వన్డేల్లో బెస్ట్ ఫిగర్ గా నమోదు అయింది.ఇక దానితో బిన్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా సంవత్సరాల పాటు కొనసాగుతారు అని అందరు అనుకున్నారు కానీ అది కుదరలేదు.ఆ తర్వాత ఆయన ఫామ్ కోల్పోవడం తో ఇండియా టీం లో చోటు కోల్పోయాడు ఆ తర్వాత కూడా మల్లి ఇండియా టీం లో చోటు దక్కించుకోలేకపోయాడు…

    కెవిన్ కరణ్ (టామ్ కరణ్, సామ్ కరణ్)
    ఇక తర్వాత చెప్పుకునే ప్లేయర్లలో కెవిన్ కరణ్ ఒకరు ఈయన ఇంగ్లాండ్ టీం తరుపున కాకుండా జింబాంబె టీం తరుపున మ్యాచ్ లు ఆడాడు. ఈయన మొత్తం 11 వన్డే మ్యాచులు ఆడగా అందులో 287 రన్స్ చేసి 9 వికెట్లు పడగొట్టాడు…ఇక ఈయన కొడుకులు అయిన టామ్ కరణ్,సామ్ కరణ్ లు మాత్రం ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం లో ఆడుతున్నారు.వీళ్లిద్దరు కూడా మంచి ఆల్ రౌండర్లు గా పేరు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం కి చాలా విజయాలను అందిస్తూ టీం లో కీలక ప్లేయర్లు గా మారారు. ఇక వీళ్లు ఇంగ్లాండ్ టీంకే కాకుండా ఐపీఎల్ లో కూడా ఆడుతూ జనాలకి వాళ్ల వంతు ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు…ముఖ్యంగా సామ్ కరణ్ అయితే ప్రస్తుతం పంజాబ్ టీం సైడ్ ఆడుతూ ఆ టీం విజయాలలో కీలక పాత్ర వహిస్తున్నాడు…ఇక కెవిన్ కరణ్ కి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు ఆయన బెన్ కరణ్ ప్రస్తుతం ఆయన కూడా క్రికెటర్ గా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడటానికి రెడీ గా ఉన్నాడు…