https://oktelugu.com/

Extraordinary Man Review: ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఫుల్ రివ్యూ…

నితిన్ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా..? వక్కంతం వంశీ రెండో సినిమాతో సక్సెస్ సాధించాడా..? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2023 9:54 am
    Extraordinary Man Review

    Extraordinary Man Review

    Follow us on

    Extraordinary Man Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ మంచి కథలను ఎంచుకుంటూ యంగ్ హీరోల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయింది.ఇక ఈయన ఇప్పుడు స్టోరీల సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చాలా మంచి కథలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీనికి కారణం ఒకానొక టైం లో నితిన్ కి వరుసగా 14 ఫ్లాపులు రావడమే మెయిన్ రీజన్… ఆ ప్లాప్ ల నుంచి కోలుకున్న నితిన్ ఇప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న నితిన్ ఆ తర్వాత వచ్చిన చెక్ అలాగే మాచర్ల నియోజకవర్గం సినిమాలతో భారీ డిజాస్టర్లని మూటగట్టుకున్నాడు. ఇక ఇప్పుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేశాడు ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. నితిన్ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా..? వక్కంతం వంశీ రెండో సినిమాతో సక్సెస్ సాధించాడా..? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ముందుగా కథ విషయానికి వస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్తున్న నితిన్ కి శ్రీలీలా పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడి అలా తన ప్రేమ ని కొనసాగిస్తూ నితిన్ ముందుకెళ్తూ ఉంటాడు.ఇక వాళ్ళ నాన్న అయిన రావు రమేష్ నితిన్ ని ఎప్పుడు తిడుతూ పనిమీద ధ్యాస ఉండదు అని దూషిస్తూ ఉంటాడు. నితిన్ మాత్రం అవన్నీ లైట్ గా తీసుకుంటూ అటు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ, ఇటు శ్రీలీలా తో ప్రేమ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి సమయంలోనే నితిన్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణం ఎవరు అనేది తెలుసుకొని అతనితో ఢీ కొట్టి తన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకున్నాడా..? లేదా అనేదే ఈ సినిమా స్టోరీ…

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్టోరీ లానే ఉంటుంది. కానీ కొన్ని ట్విస్ట్ లతో దర్శకుడు ఈ సినిమాకి వేరే లెవెల్ ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా వక్కంతం వంశీ అందించిన కథలలో డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇంతకు ముందు ఆయన కథ రచయితగా చాలా సినిమాలకి కథలు అందించాడు. అలాగే డైరెక్టర్ గా మారి అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన రేంజ్ లో ఆడలేదు. దాంతో ఇప్పుడు నితిన్ తో ఈ సినిమా చేశాడు.ఇక దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశ్యం తోనే ఆయన కమర్షియల్ ఫార్ములానే ఎంచుకొని కామెడీ యాంగిల్ ని టచ్ చేస్తూ అనుకున్న కథని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు.అయితే కథలో ఫాల్ట్ లేకపోయిన కూడా డైరెక్షన్ లో దర్శకుడు కొన్ని తప్పులు అయితే చేశాడు… స్ట్రైయిట్ ఫార్వార్డ్ గా కాకుండా స్క్రీన్ ప్లే మార్చి సినిమా తీసి ఉంటే ఇంకా బాగుండేది. అలాగే డైరెక్షన్ లో ఇంకొంచెం షార్ప్ నెస్ పెంచుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక ఫస్ట్ సినిమా నేర్పిన పాఠంతో ఆ సినిమాలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా చూసుకున్నప్పటికీ ఈ సినిమాలో మరికొన్ని కొత్త తప్పులను కూడా వక్కంతం వంశీ చేశాడు.

    అవి ఏంటి అంటే ఆయన క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ లో ఆ క్యారెక్టర్ ని ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా వాడుకోవడంలో మాత్రం ఆయన కొంత వరకు ఫెయిల్ అయ్యారు… ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎక్స్ ట్రా ఆర్డినరీ అనే విధంగా ఉంటాయి. అందులో నితిన్ కూడా తనదైన రీతిలో కొన్ని సీన్లలో టాప్ నాచ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు… ముఖ్యంగా ఈ సినిమా అనేది పక్కత వంశీ కెరియర్ ని డిసైడ్ చేసే సినిమా కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే వంశీకి డైరెక్షన్ పరంగా చాలా హెల్ప్ అయ్యేది…

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే హీరో నితిన్ ఎప్పటిలాగే చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కామెడీ ని ఈ సినిమాలో అద్భుతంగా పండించాడు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ చేసే నితిన్ ఈ సినిమాలో కామెడీ నెక్స్ట్ లెవెల్ లో పండించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. తనలో కామెడీ యాంగిల్ ఉంది అనేది భీష్మ లో ప్రూవ్ చేశాడు.కానీ ఈ సినిమా లో నెక్స్ట్ లెవల్ లో కామెడీ పండిస్తాడు అని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందుకే ఒక ఆర్టిస్ట్ లో డెప్త్ ఎంత ఉంది అనేది చెప్పడం చాలా కష్టమని ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక శ్రీలీలా గ్లామర్ టచ్ తో ప్రేక్షకులను బాగా మెప్పించింది. రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో చాలా మంచి నటనని కనబరిచి మెప్పించింది. అదేవిధంగా ఈ సినిమాలో కూడా తన పాత్ర పరిధి మేరకు ఎక్కడా కూడా పాత్రల నుంచి బయటికి రాకుండా సెటిల్డ్ గా యాక్టింగ్ చేసింది…

    ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఆయనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో ఆయన తప్ప ఎవరూ చేయలేరు అనెంత లా నటించి మెప్పించాడు. కానీ కొన్ని సీన్లల్లో ఆయన్ని చూస్తే ఆ క్యారెక్టర్ కి రాజశేఖర్ మైనస్ అవుతున్నాడా అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ క్యారెక్టర్ తో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్కెట్లోకి అయితే వచ్చాడు. మరి ఆయనకి ఏ మేరకు అవకాశాలు వస్తాయనేది చూడాలి. ఇక రావు రమేష్ పర్ఫామెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే ఏమీ లేదు.ఎందుకంటే ఆయన చేయాల్సిన అన్ని క్యారెక్టర్లు ఇప్పటికే చాలా సినిమాల్లో చేసేసి ఉన్నాడు.కాబట్టి ఆయన కొత్తగా చేసేది ఏమీ లేదు.ఈ సినిమాలో కూడా హీరో ఫాదర్ గా చేసి హీరోకి కౌంటర్స్ వేస్తూ అధ్యంతం కామెడి ని పండిస్తూ సినిమా బాగా రావడంలో తన వంతు పాత్ర అయితే పోషించాడు…

    ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా కి మ్యూజిక్ అందించిన హరీష్ జైరాజ్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే అనిపించింది. హరీష్ జైరాజ్ అంటే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కానీ మళ్లీ ఆయన మ్యాజిక్ ని ఈ సినిమాలో మనం చూడలేకపోయాం… ఆయన తెలుగులో ఒకప్పుడు మ్యూజిక్ ఇచ్చిన ఆరెంజ్ ,మున్నా, సైనికుడు లాంటి సినిమాలు ప్లాప్ అయిన కూడా మ్యూజిక్ ఆల్బమ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది… ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అయిన ఆర్థర్ విల్సన్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్లల్లో విజువల్స్ అయితే ఆ సీన్లను ఎలివేట్ చేయడానికి కొన్ని డిఫరెంట్ షాట్స్ ని యూజ్ చేశారు. అయితే అది డైరెక్టర్ చెప్పాడా, లేదంటే తనే చేశాడో తెలీదు కానీ ఆ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి ఇక దాంతో ఈ సినిమాకి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది…ఇక ఈ సినిమాకి ఎడిటర్ అయిన ప్రవీణ్ పూడి చేసిన ఎడిటింగ్ కొంత వరకు బాగున్నప్పటికీ కొన్ని సీన్లల్లో లెంత్ కట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిచోట్లలో నటుడు సంపత్ ,నితిన్ మధ్య వచ్చే కామెడీ సీన్లు కొంచెం లాగైనట్టుగా అనిపించింది. వాటిని కనక షార్ప్ ఎడ్జ్ లో కట్ చేసి ఉంటే ఎడిటర్ పని తనం కనిపించేది…

    ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే

    నితిన్, శ్రీలీల
    కథ
    సినిమాటోగ్రఫీ

    ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ ఏంటంటే

    స్క్రీన్ ప్లే
    మ్యూజిక్
    డైరెక్షన్ ( కొన్ని సీన్లలో)

    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5