https://oktelugu.com/

Lifi : WiFi కి వంద రెట్ల వేగంతో దూసుకొస్తోంది LiFi…. మోడెమ్, రౌటర్ ఏమీ అక్కర్లేదు

మొత్తంగా వైఫై స్పీడుకే మనం ఎంతో సంతోషిస్తున్నాం.. ఇక దీనికి 100 రెట్ల వేగంగా లైఫై వస్తే మన ఇంటర్నెట్ వేగమే మారిపోతుంది. ఇది సాకారం కావాలని అందరం ఆశిద్దాం..

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2023 / 05:39 PM IST
    Follow us on

    Lifi : కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. ‘STD , ISD’ లాంటి ల్యాండ్ ఫోన్లు వచ్చినప్పుడు వాటినే వింతగా చూశాం. గల్లీ గల్లీలో ఏర్పాటు చేసుకొని మాట్లాడాం. కానీ సెల్ ఫోన్ రాకతో అంతా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ తో జీవితమే అరచేతిలోకి వచ్చింది. టెక్నాలజీకి అనుగుణంగా మనం అప్డేట్ కావాల్సిందే.. ఇప్పుడు అంతా వైఫై.. ఇంటర్నెట్ లేనిదే పూట గడవదు. ఇన్నాళ్లు ఇల్లంతా వైఫై వచ్చేలా ఎంజాయ్ చేస్తున్నాం.. రాకుంటే గిలగిలలాడుతున్నాం. కానీ వైఫై కు మించిన సాంకేతికత వస్తోంది. అదే ‘లైఫై’. అసలేంటి లైఫై.. దీని స్పీడు ఎంత? ఎలా పనిచేస్తుంది అన్న దానిపై స్పెషల్ ఫోకస్.

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (IEEE) IEEE 802.11 WiFi స్పీడును అప్ డేట్ చేస్తోంది. కాంతి-ఆధారిత వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ల కోసం 802.11bb అనే కొత్త స్పీడో సాంకేతికతను జోడించింది. IEEE 802.11bb అని పిలువబడే ఈ ప్రమాణాన్ని LiFi సాంకేతికతగా పిలుస్తున్నారు. విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్రేమ్‌వర్క్‌ను మొదలుపెట్టారు.

    -LiFi అంటే ఏమిటి?
    LiFiను “లైట్ ఫిడిలిటీ” అంటారు. ఇది విజిబుల్ లైట్ కమ్యూనికేషన్స్ సిస్టమ్. 100Gbps కంటే ఎక్కువ వేగంతో వైర్‌లెస్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌లను ప్రసారం చేస్తుంది. డేటాను ప్రసారం చేయడానికి LiFi సాంకేతికత రేడియో ఫ్రీక్వెన్సీలకు బదులుగా కాంతిని ఉపయోగిస్తుంది. అందుకే అంత వేగంగా ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు. WiFi, 5G వంటి సాంకేతికతలతో పోలిస్తే కంపెనీలు వేగవంతమైన (100 రెట్లు వరకు), మరింత విశ్వసనీయమైన వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లను అందించడానికి లైట్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవచ్చని దీని అర్థం.

    లైఫై కోసం కాంతితరంగాలను వాడుతారు. వీటిని విడుదల చేయడానికి LED లైట్ బల్బులను ఉపయోగించడం ద్వారా సాంకేతికత పని చేస్తుంది. ఆ బల్బ్ లోపల, డేటా రిసీవర్లకు వాటి నుండి ప్రయాణించేలా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు హై-స్పీడ్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి LiFi అమర్చిన లైట్‌ని ఆన్ చేయవచ్చు. పాదచారులకు , వాహనాలకు డేటాను అందించడానికి వీధి దీపాల్లో ఈ లైఫై లైట్ ను త్వరలో ఉపయోగించవచ్చు. తద్వారా అందరికీ వేగవంతమైన ఇంటర్నెట్ ను సమకూర్చువచ్చు.

    -మనకు LiFi ఎందుకు అవసరం
    LiFi ప్రకారం వైర్‌లెస్ డేటా వినియోగం ప్రతి సంవత్సరం 60% పెరుగుతుంది అంటే రేడియో-ఫ్రీక్వెన్సీ స్పేస్ ఇంకా పెరుగుతంది. పెరుగుతున్న వినియోగదారులకు అవసరమైన ఇంటర్నెట్ అందించడానికి అవసరమైన తగినంత వైర్‌లెస్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కొరత ఏర్పడుతుంది. వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు మన ఇంటర్నెట్ వేగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఎంతకూ సరిపోవు. చివరికి వైఫై డేటా కోసం డిమాండ్‌ ఏక్కువ అవుతుంది. అందుకే లైఫై తో వందరెట్ల వేగం.. బల్బులతోనే అంతటా దీన్ని సమకూర్చవచ్చు.

    -WiFi ద్వారా LiFi ప్రయోజనాలు
    24/7 శక్తిని వినియోగించే రూటర్లు, మోడెమ్‌లు, సిగ్నల్ రిపీటర్లు, వేవ్ యాంప్లిఫైయర్‌లు , యాంటెన్నాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల అవసరం LiFiకి అవసరం లేదు. పర్యావరణపరంగా కూడా ఇది ఎలాంటి హానీ కలుగదు. LiFiని LED బల్బులకు కనెక్ట్ చేయవచ్చు కాబట్టి దీనికి అదనపు విద్యుత్ వినియోగం అవసరం ఉండదు. ఇది డేటాను ప్రసారం చేయడానికి సౌర శక్తిని ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మారుమూల , అభివృద్ధి చెందని ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది.

    -మనకు LiFi ఎప్పుడు లభిస్తుంది
    ఒక సగటు వినియోగదారుడు టెక్నాలజీని ఉపయోగించడానికి కొంత సమయం వరకు వేచి ఉండవలసి ఉంటుంది. LiFi ఒక దశాబ్దం పాటు అభివృద్ధిలో ఉంది. అనేక ఉత్పత్తులు కూడా సృష్టించబడ్డాయి. డిఫెన్స్, హెల్త్‌కేర్, లైటింగ్, IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెల్కోలు, డివైజ్ ఇంటిగ్రేటర్‌లు వంటి వివిధ పరిశ్రమలు బహుళ వినియోగ కేసుల కోసం LiFiపై ప్రయోగాలు చేస్తున్నాయి.

    మొత్తంగా వైఫై స్పీడుకే మనం ఎంతో సంతోషిస్తున్నాం.. ఇక దీనికి 100 రెట్ల వేగంగా లైఫై వస్తే మన ఇంటర్నెట్ వేగమే మారిపోతుంది. ఇది సాకారం కావాలని అందరం ఆశిద్దాం..