https://oktelugu.com/

BJP Survey: సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నా.. భయపడుతున్న బిజెపి

దాదాపు ఇటీవల వెల్లడైన సర్వేలన్నీ కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలో వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెల్లడైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారమని తేల్చి చెబుతున్నాయి.

Written By:
  • BS
  • , Updated On : August 5, 2023 / 09:52 AM IST

    BJP Survey

    Follow us on

    BJP Survey: కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? సర్వేలన్నీ అలానే చెబుతున్నాయా? ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా.. బిజెపికి సీట్లు తగ్గుతాయి అనడం దేనికి సంకేతం? ఈ లెక్కన ప్రమాద ఘంటికలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

    దాదాపు ఇటీవల వెల్లడైన సర్వేలన్నీ కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలో వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెల్లడైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారమని తేల్చి చెబుతున్నాయి. ఇటీవల ఇండియా, టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ లో సైతం ఇదే తేలింది. ఎన్డీఏ కూటమికి 318 సీట్లు.. విపక్షాల కూటమికి 175, ఇతరులకు 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. అటు మేనెలాఖరులో ఎన్డి టీవీ, సి ఎస్ డి ఎస్ సర్వేలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. దేశంలో 43 శాతం మంది మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తేలింది. ఆ తర్వాత స్థానంలో 16 శాతం తో రాహుల్ గాంధీ నిలిచారు.

    అయినా సరే బిజెపికి నమ్మకం చాలడం లేదు. అందుకే ముందస్తుగా కొంతమంది మిత్రులను చేరదీస్తోంది. మొన్నటికి మొన్న ఎన్డీఏ పక్షాల సమావేశం నిర్వహించింది. అకాలిదళ్,లోక్ జనశక్తి వంటి పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంది. 26 పార్టీలతో విపక్ష ఇండియా కూటమి బిజెపిని కలవరపరుస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విపక్ష కూటమిలో ఉన్న పార్టీలన్నీ బలమైన పాత్ర పోషించదగినవే. దీంతో బిజెపికి సులభంగా విజయం దక్కకపోవచ్చు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అనుకూలంగా వస్తున్నా.. ఎన్నికల ముంగిట సీన్ మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే మోడీ, షా ధ్వయం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్ లాంటి నాయకులను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.