Errabelli Dayakar Rao : అసలే ఎన్నికల సీజన్. మీడియా అంతా ఫుల్ ఫోకస్డ్ గా ఉంటుంది. ఇక నేతలు ప్రభుత్వం వద్ద పైసలు లేకున్నా ఏదో పనులు చేస్తున్నామన్నట్టు శంకుస్థాపనల మీద పడ్డారు. నిధులు విడుదల చేసిందని శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు అందరు మంత్రులు చేసే పని ఇదే.
తాజాగా బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి కూడా ఇలా ఏ ఎమ్మెల్యే పిలిచినా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పోలో మని వెళ్లిపోతున్నారు. అయితే అక్కడ ఏర్పాట్లు నచ్చకనో.. లేదా మరో కారణమో కానీ ఎర్రబెల్లి నొచ్చుకున్నారు. ఫీల్ అయిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కొట్టారు.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత పార్టీ బీఆర్ఎస్ షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో శంకుస్థాపన కార్యక్రమంలో ఎర్రబెల్లికి అక్కడ ఏం నచ్చలేదో కానీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను అందరి ముందే తలపై ఒక్కటి కొట్టడంతో అందరూ అవాక్కయ్యారు. ఇట్లా చేస్తావా పనులు అంటూ తిట్టిపోశారు. ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వకుండా మంత్రి ఇలా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎర్రబెల్లి ఎమ్మెల్యేను ఎందుకు కొట్టారన్నది తెలియాల్సి ఉంది.
షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తల మీద కొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు pic.twitter.com/zp6KkQB4QO
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2023