Engaland vs India : రాంచీ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్ట్ అనూహ్య మలుపు తీసుకుంది. మైదానం క్రమంగా బౌలర్లకు అనుకూలిస్తోంది. ఆదివారం ఒక రోజే ఇరుజట్లకు సంబంధించి పది వికెట్లు నేలకూలాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆదివారం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 307 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ధృవ్ 90 పరుగులు చేసి భారత జట్టు పట్ల ఆపద్బాంధవుడుగా నిలిచాడు. కులదీప్ యాదవ్ తో కలిసి ఎనిమిదవ వికెట్ కు 76 పరుగులు, తొమ్మిదో వికెట్ కు ఆకాష్ తో కలిసి 40 పరుగులు, సిరాజ్ తో కలిసి చివరి వికెట్ కు 14 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి భారత జట్టు స్కోరును 307 పరుగులకు చేర్చాడు. 90 పరుగుల వద్ద హార్ట్ లీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ధృవ్ వీరోచిత పోరాటం వల్ల ఇంగ్లాండ్ ఆధిక్యం 46 పరుగులకు తగ్గింది.
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ అశ్విన్ ధాటికి పేక మేడలా కూలిపోయింది. 145 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 19 పరుగులకే డకెట్, పోప్ వికెట్లను అశ్విన్ తీశాడు. రెండు వరుస బంతుల్లో ఈ రెండు వికెట్లను ఇంగ్లాండ్ జట్టు కోల్పోవడం విశేషం. రూట్, క్రావ్ లే మూడో వికెట్ కు 46 పరుగులు జోడించారు. ఈ దశలో జట్టు స్కోరు 65 పరుగులకు చేరుకున్నప్పుడు రూట్ ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. క్రావ్ లే, బెయిర్ స్టో నాలుగో వికెట్ కు 55 పరుగులు జోడించారు.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్ లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 110 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రావ్ లే కుల దీప్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ అతని స్కోరు 60 పరుగులు. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో క్రావ్ లే సాధించిన కోరే అత్యధికం. ఇక అప్పటి నుంచి ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. కేవలం 25 పరుగుల వ్యవధిలోనే మిగతా ఐదు వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. స్టోక్స్, బెయిర్ స్టో, ఫోక్స్, హార్ట్ లీ, అండర్ సన్, బషీర్.. వెంట వెంటనే ఔట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 145 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు, కుల దీప్ 4, జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, భారత్ ఎదుట ఇంగ్లాండ్ 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది..
Innings Break!
Outstanding bowling display from #TeamIndia
5️⃣ wickets for @ashwinravi99
4️⃣ wickets for @imkuldeep18
1️⃣ wicket for @imjadejaTarget for India – 192
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/kpKvzoWV0p
— BCCI (@BCCI) February 25, 2024