Elections Commission : వచ్చే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ లోక్ సభకు, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీకి సంబంధించిన ముఖ్యమైన ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో పాటు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమలులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.
నేటి నుంచి దాదాపు రెండు నెలల వ్యవధి ఏపీ ఎన్నికలకు ఉంది. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ప్రకటించింది.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ – తదుపరి ఫలితాల ప్రకటన జూన్ 4న జరగనుంది.
ఏప్రిల్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25 గా తెలిపింది..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందా? టిడిపి-జెఎస్‌పి-బిజెపికి తిరిగి అధికారం ఇస్తారా? అన్నది మే 13న ఓటర్లు తమ ఓటు హక్కును వేస్తారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి.. జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు.