https://oktelugu.com/

Duo Euthanasia: మరణంలోనూ జంటగా అంటే మాటలు కాదు.. గుండెను మెలిపెట్టే భార్యాభర్తల కథ ఇది

డ్రైస్ వాన్ ఆగ్ట్ డచ్(నెదర్లాండ్) దేశానికి అధ్యక్షుడిగా పని చేశాడు.. 1977 నుంచి 1982 వరకు ఆయన పదవిలో కొనసాగారు.. క్రిస్టియన్ డెమొక్రటిక్ అప్పీల్ అనే పార్టీని స్థాపించాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 14, 2024 / 03:47 PM IST
    Follow us on

    Duo Euthanasia: ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటారు.. కలిసి కాపురం చేస్తారు. పిల్లలకు తల్లిదండ్రులు అవుతారు.. సంసార సాగరాన్ని నెట్టుకొస్తారు. పిల్లలు పెద్ద వాళ్ళు అవుతారు.. ఉపాధి నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ఎవరిదారి వారు చూసుకుంటారు. ఈలోగా ఆ తల్లిదండ్రులు వృద్ధులవుతారు. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడి ఎవరో ఒకరు ముందుగా కన్ను మూస్తారు. ఇది ప్రకృతిలో సహజమే.. పుట్టడం, కొంత కాలమైన తర్వాత గిట్టడం.. కానీ అప్పటిదాకా కలిసి ఉన్న మనిషి చనిపోతే ఇంకో మనిషికి చాలా ఇబ్బంది. మాట్లాడే వారు ఉండరు. మాట్లాడితే వినేవారు ఉండరు. అదొక నరకం.. అదొక బాధ. బతికినంతసేపు గుండెను అదిమి పట్టలేనంత దుఃఖం. అందుకే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పిల్లల్ని తన వద్ద ఉండాలని కోరుకునేది అందుకే. ఐతే ఇలాంటి వృద్ధాప్య బాధను తట్టుకోలేక.. ఒకరు చనిపోతే మరొకరు ఉండలేక.. ఆ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి కన్నుమూశారు. వినడానికి ఎంటన్హృదయ విదారకంగా ఉంది కదా..

    డ్రైస్ వాన్ ఆగ్ట్ డచ్(నెదర్లాండ్) దేశానికి అధ్యక్షుడిగా పని చేశాడు.. 1977 నుంచి 1982 వరకు ఆయన పదవిలో కొనసాగారు.. క్రిస్టియన్ డెమొక్రటిక్ అప్పీల్ అనే పార్టీని స్థాపించాడు. 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అధ్యక్షుడిగా ఉన్నంతసేపు నెదర్లాండ్ దేశంలో విలువలను కాపాడాడు. నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అక్కడి రాజకీయాలను శాసించాడు.
    డ్రైస్ వాన్ అగ్ట్ కు యూజీనీ అనే భార్య ఉంది. డ్రైస్ వాన్ అగ్ట్ కు ప్రస్తుతం 93 సంవత్సరాలు. అతని భార్యకు ఇంచుమించుగా అదే వయసు ఉంటుంది.

    డ్రైస్ వాన్ అగ్ట్ కు 2019లో మెదడులో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. మరోవైపు అతని భార్య కూడా అనారోగ్యానికి గురై ఆమె కూడా మంచం పట్టింది. ఇలా ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. అలాగని ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఈ క్రమంలో వారు జంటగా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 5న డ్రైస్ వాన్ అగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్ లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కన్నుమూశారు. ఈ విషయాన్ని దీ రైట్స్ ఫోరం ధృవీకరించింది.”మా వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ డ్రైస్ వాన్ అగ్ట్ ఫిబ్రవరి 5, నిజ్ మెగన్ లో తన భార్యతో కలిసి మరణించారు. వారిద్దరూ 70 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను నా అమ్మాయి అని సంబోధించేవాడు. ఇద్దరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని” ది రైట్స్ వింగ్ డైరెక్టర్ గెరాడ్ జొంక్ మన్ తెలిపారు.

    నెదర్లాండ్ దేశంలో ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజక్షన్ తీసుకొని చనిపోవాలని కోరుకోవడం ఈమధ్య బాగా పెరుగుతుంది. దీనిని ఇంగ్లీషులో “duoEuthanasia” అంటారు.. తెలుగులో అయితే “అనాయాస మరణం” అని పేర్కొంటారు.. ప్రాణాంతక వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పుడు.. జీవిత భాగస్వాములిద్దరూ పరస్పరం ప్రాణాంతక ఇంజక్షన్ వేసుకొని చనిపోవడం ఈ మధ్య నెదర్లాండ్ లో బాగా పెరిగిపోయింది. 2021లో 16 జంటలు.. అంతకు ముందు సంవత్సరం 13 జంటలు ఇలా చనిపోయాయి. 2022లో 29 జంటలు ఇలా ప్రాణాలు తీసుకున్నాయి. ఇలాంటి మరణాలు దేశంలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. జంటలు మాత్రమే కాకుండా నెదర్లాండ్ దేశంలో ప్రతి సంవత్సరానికి సుమారు 1000 మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నారని ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ చెబుతున్నారు. జంట చేసే అభ్యర్థనలు కాకుండా వ్యక్తిగతంగా చేసేవి ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన అంటున్నారు.”ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో ఉపశమనం పొందలేని బాధతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు అనాయాస మరణాన్ని కోరుకుంటున్నార” ని ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ వివరిస్తున్నారు. నెదర్లాండ్ దేశం 2002 నుంచి అనాయాస మరణానికి సంబంధించి ఆరు షరతులతో దానిని చట్టబద్ధం చేసింది. మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి. కాగా నెదర్లాండ్ మాజీ అధ్యక్షుడు, భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు.