https://oktelugu.com/

Rahul Dravid: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో మన తెలుగు ప్లేయర్.. సంచలన వాఖ్యలు చేసిన కోచ్ ద్రావిడ్…

టీమ్ లో ఒక కీలక ప్లేయర్ గా ఉంటూ కీపర్ గా చేయడం అనేది చాలా కష్టం, అలా చేసినట్లైతే ఆయనకి ఎక్కువ భారం పడుతుంది. దానివల్ల తన ఫామ్ ని తను కంటిన్యూ చేయలేడనే ఉద్దేశ్యం తోనే రాహుల్ ని కాకుండా వేరే వాళ్ళతో కీపింగ్ చేయించాలని భావిస్తున్నట్టు గా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 23, 2024 / 04:39 PM IST
    Follow us on

    Rahul Dravid: ఒకప్పుడు ఇండియన్ టీమ్ ఓటమి ఎదురైతే కుంగిపోయేది, మిగితా మ్యాచ్ ల్లో గెలుస్తామా లేదా అనే భయంతో ఆడుతూ గెలిచే మ్యాచ్ లను కూడా ఓడిపోయేది. కానీ ఇప్పుడున్న టీమ్ మాత్రం అంతకు ముందు ఉన్న లెక్కలన్నీ మార్చేసింది. ఒక మ్యాచ్ ఓడిపోతే దానికి రివెంజ్ అనేది డబుల్, త్రిబుల్ గా ఇచ్చేస్తుంది. ప్రస్తుతం ఇండియన్ టీమ్ అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతూ ప్రపంచం లో ఉన్న అన్ని దేశాల క్రికెట్ టీమ్ లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక ఇండియన్ టీమ్ లో ఎక్కువ మంది ప్లేయర్లు ఉండటం వల్ల బిసిసిఐ మూడు ఫార్మాట్లకు సపరేట్ ప్లేయర్లను సెలెక్ట్ చేస్తూ, వాళ్ళతో ఆడిస్తూ ఇండియన్ టీమ్ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తుంది. ఇక దీనివల్ల ప్లేయర్లందరికి అవకాశం వస్తుంది, అలాగే క్రికెటర్ల మీద ఎక్కువ భారం పడకుండా ఉంటుంది.

    ఇక ఇదిలా ఉంటే ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో ఇండియన్ టీమ్ టెస్ట్ సిరీస్ ని ఆడటానికి రెఢీ అవుతుంది. ఇక ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్ లను ఆడబోతుంది. ఇక అందులో భాగంగానే ఇప్పటికే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదనే విషయం మనకు తెలిసిందే. ఇక అతని ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు అనే ఆసక్తి ఒకవైపు ఉంటే, ఇక మరోవైపు రాహుల్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలను తెలియజేశాడు.

    అవి ఏంటంటే ఇండియన్ టీమ్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న కే ఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సీరీస్ లో వికెట్ కీపింగ్ చేయడం లేదు ఆయన ప్లేస్ లో కేఎస్ భరత్ ని గాని, లేదంటే ధృవ్ జురెల్ ని గాని తీసుకుంటామంటూ రాహుల్ ద్రావిడ్ తెలియజేశాడు. అయితే కే ఎల్ రాహుల్ సౌతాఫ్రికా టీమ్ మీద తనదైన రీతిలో ఒక సూపర్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. ఆయన బ్యాటర్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టే ఆయన చేత కీపింగ్ చేయనివ్వకూడదని కోచ్ ద్రావిడ్ భావిస్తున్నట్టు గా తెలుస్తుంది.

    టీమ్ లో ఒక కీలక ప్లేయర్ గా ఉంటూ కీపర్ గా చేయడం అనేది చాలా కష్టం, అలా చేసినట్లైతే ఆయనకి ఎక్కువ భారం పడుతుంది. దానివల్ల తన ఫామ్ ని తను కంటిన్యూ చేయలేడనే ఉద్దేశ్యం తోనే రాహుల్ ని కాకుండా వేరే వాళ్ళతో కీపింగ్ చేయించాలని భావిస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇలా చేస్తే కే ఎల్ రాహుల్ కి కొంచెం ఫ్రీడం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గా ద్రావిడ్ తెలియజేశాడు.ఇక రిషబ్ పంత్ కి రీప్లేస్ మెంట్ గా టీమ్ లోకి వచ్చిన కే ఎస్ భరత్ ఇప్పుడు మళ్లీ వికెట్ కీపర్ గా చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. కీపర్ గా ధృవ్ జురెల్ కూడా పోటీ లో ఉన్నప్పటికీ ధృవ్ జురెల్ తో పోల్చితే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా కే ఎస్ భరత్ కి మంచి అనుభవం ఉంది.

    అలాగే తను కీపింగ్ చేయగలడు, బ్యాటింగ్ కూడా చేయగలడు.ఇక ఇప్పటివరకు తను ఆడిన టెస్ట్ మ్యాచ్ లు అన్నింట్లో కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి తనైతేనే వికెట్ కీపర్ గా బ్యాటర్ గా టీమ్ లో బాగా సెట్ అవుతాడు అలాగే టీమ్ కి అవసరమైన సమయంలో పరుగులు కూడా చేస్తూ టీమ్ విజయంలో తను కీలక పాత్ర పోషిస్తాడు అంటూ మరి కొంతమంది భావిస్తున్నారు. ఇక ఆల్మోస్ట్ కే ఎస్ భారత్ నే వికెట్ కీపర్ గా ఈ టెస్ట్ సిరీస్ కి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి… ఇక ఇది తెలిసిన అభిమానులు మళ్ళీ తెలుగు ప్లేయర్ తన సత్తా చాటడానికి రెఢీ అవుతున్నాడు అంటూ సంతోష పడుతున్నారు…