Donald Trump: అమెరికాలో ఎన్నికల వేడి.. ట్రంప్‌ ఖాతాలో మరో భారీ విజయం!

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్‌లో ఇటీవల ప్రాథమిక ఎలక్టోరల్‌ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కు 52.8 శాతం ఓట్లు పోలయ్యాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : January 24, 2024 11:22 am
Follow us on

Donald Trump: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఏడాది చివరన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. అక్కడ ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ అదికారంలో ఉంది. జో బైడెన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈఏడాది చివరికి ఆయన పదవీకాలం ముగియనుంది. వచ్చే ఎన్నికల్లోనూ డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఆయన బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థి కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

రేసులో ట్రంప్‌..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేనున్నారు. ఈమేరకు ఆ పార్టీ ఆయనను అభ్యర్థిగా ఎన్నుకుంది. ట్రంప్‌పై ఆరోపణలు, కేసులు ఉన్నా రిపబ్లికన్‌ పార్టీ అతనిపైనే విశ్వాసం ఉంచింది. 2019 ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయారు. అయినా.. మళ్లీ బరిలో నిలిపేందుకు మొగ్గు చూపుతోంది.

అయోవా ఎన్నికల్లో ఘన విజయం..
రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్‌లో ఇటీవల ప్రాథమిక ఎలక్టోరల్‌ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కు 52.8 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో మిగతా అభ్యర్థులు రాన్‌ డీశాంటీస్‌కు 21.4 శాతం, నిక్కీ హేలీకి 17.7 శాతం, వివేక్‌ రామస్వామికి 7.2 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రాన్‌ డీశాంటీస్, వివేక్‌ రామస్వామి పోటీ నుంచి తప్పుకున్నారు. రామస్వామి భారతీయ సంతతి వ్యాపారవేత్త.

ట్రంప్‌కు పోటీ ఇస్తున్న నిక్కీ హేలీ..
ఇక అభ్యర్థి ఎన్నికల్లో ట్రంప్‌కు మరో భారతీయ సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వీరిలో తమ అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై ఇప్పుడు తాజాగా మరో స్టేట్‌లో రిపబ్లికన్‌లు ఎలక్టోరల్‌ ఎన్నికలు చేపట్టారు. న్యూ హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన ఈ ఎన్నికలోనూ డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ విజయం సాధించారు. నిక్కీ హేలీ రెండోస్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 41,423 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ట్రంప్‌కు 53.8 శాతం ఓట్లు వచ్చాయి. నిక్కీహేలీకి 46.1 శాతం ఓట్లు వచ్చాయి. కౌంటింగ్‌ కొనసాగుతున్నందున ఇద్దరి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది.

ముచ్చటగా మూడోసారి..
డొనాల్డ్‌ ట్రంప్‌ ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024 ఎన్నికల్లో ట్రంప్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.