సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు ఎంతో సాంప్రదాయబద్ధంగా, సాంప్రదాయ దుస్తులను ధరించి వెళ్లడం ఆనవాయితీ.కానీ ప్రస్తుతం ఎంతోమంది పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకు అలవాటుపడి దేవాలయాలకు వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్లడం, పాశ్చాత్య దుస్తులను ధరించి వెళ్లడం వంటివి చేస్తున్నారు. అయితే దేవాలయాలను దర్శించినప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలని, జుట్టు విరబోసుకుని వెళ్లకూడదని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
Also Read: ఆధార్ కార్డులో పెళ్లి భోజనాల లిస్ట్.. అసలేం జరిగిందంటే..?
దేవాలయాలలో భగవంతునికి చేసే సేవలు కార్యక్రమాలు ఎంతో పవిత్రంగా నిర్వహించాలి. అదే సమయంలో జుట్టు విరబోసుకుని ఆలయానికి సందర్శించినప్పుడు జుట్టు రాలి పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రం అవుతాయి. అదేవిధంగా ఆలయాలలో ప్రసాద నివేదన జరుగుతుంది.జుట్టు విరబోసుకుని వెళ్ళటం వల్ల పొరపాటున వెంట్రుకలు ఆహారపదార్థాలలో పడటం వల్ల ఆహారం వృధా గా మారిపోతుంది.
Also Read: శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. అదేంటంటే..?
అదేవిధంగా వ్రత దీక్ష చేసే వారి కాళ్లకు తల వెంట్రుకలు లేదా తల నుంచి రాలిన నీటిబిందువులు తగలడం వల్ల వారి ఈ వ్రత దీక్ష భంగం కలుగుతుంది. ఆ విధంగా దీక్షా భంగం కలగడం వల్ల ఏర్పడే దోషం అది ఎవరి వల్ల అయితే జరిగిందో వారికి కలుగుతుంది.అదేవిధంగా శుక్రవారం సాక్షాత్తు ఆ శ్రీమహాలక్ష్మికి పూజ చేసే సమయంలో జుట్టు వదులుకొని పూజలు చేయకూడదు. ఒకవేళ అలా చేసిన నేపథ్యంలో అమ్మ వారి అనుగ్రహం మనపై కలగదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుకోసమే శుక్రవారం పూజ చేసే సమయంలో, లేదా అమ్మవారికి వ్రతం చేసే సమయంలో తప్పనిసరిగా జుట్టును ముడి వేసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం