Independence Day 2023: ప్రతీ ఏడాది ఆగస్టు 15 రాగానే భారతీయుల్లో ఎక్కడా లేని ఎమోషన్ వస్తుంది. పరాయి పాలనలో ఉన్న మనదేశం మనకు దక్కిన ఈరోజున ప్రతి ఒక్కరూ వేడుకగా నిర్వహించుకుంటారు. కుల, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జెండా పండుగలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను ప్రజలంతా వీక్షించేందుకు దూరదర్శన్ లో ఉచితంగా ప్రసారం చేస్తారు. అయితే ఈ వేడుకలు ప్రసారం అయినప్పడు వెనుక నుంచి మనకో మ్యూజిక్ వినిపిస్తోంది. ఈ సంగీతం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వస్తోంది. ఈ మ్యూజిక్ ను ఎవరు కంపోజ్ చేశారో తెలుసా?
1947 ఆగస్టు 15న వేడుకలు నిర్వహించడంలో భాగంగా సంగీతం ఉండాలని అప్పటి నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా సంగీత విద్వాంసుల ఎంపిక జరిగింది. వీరిలో బిస్మిల్లా ఖాన్ పేరు మొదటి వరుసలోకి వచ్చింది. వుడ్ విండ్ వాయిద్యంతో చేసిన సంగీతానికి భారతీయలు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో దూరదర్శన్ లో ప్రసారం అవుతుండగా బ్యాగ్రౌండ్ లో ఈ మ్యూజిక్ వచ్చేది. ఈ సంగీతంతో వేడుకలను చూస్తే ఎంతో హాయిగా ఉండేది.
భిస్మిల్లాఖాన్ (ఖమరుద్దీన్) బిహార్ లోని షాహబాద్ జిల్లా, డుమ్రన్ లో 1916లో ముస్లిం సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి బీహార్ లోని డుమ్రన్ ఎస్టేట్ కు చెందిన మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో సంగీత విద్వాంసుడు. ఇతని ఇద్దరు తాతలు ఉస్తాద్ సాలార్ హుస్సేన్, రసూల్ బక్స్ ఖాన్ కూడా సంగీత విద్వాంసులు. బిస్మిల్లాఖాన్ వివిద స్టేజీలపై తన మ్యూజిక్ ను ప్రదర్శించాడు. 1937లో కోల్ కతాలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ లో జరిగిన ఓ సంగీత కచేరితో వెలుగులోకి వచ్చాడు. ఆ తరువాత విదేశాల్లో సంగీత కచేరిలు చేశాడు.
ఈయన ప్రతిభ చూసిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 1947 ఆగస్టు 15న షెహనాయ్ వాయించమని అడిగారు. అయితే బిస్మిల్లాఖాన్ చేసిన సంగీతానికి భారతీయులు ముగ్ధులయ్యారు. దీంతో ప్రభుత్వం సైతం అతనిని భారతరత్న బిరుదుతో సత్కరించింది. అలాగే పద్మవిభూషన్, పద్మభూషణ్ లాంటి అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక 2006లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఈ సంవత్సరం మార్చి 17న ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.