https://oktelugu.com/

Tollywood Heroes: సినిమా ఇండస్ట్రీకి దూరమైన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

వెండితెరకు దూరమైన హీరోలలో తరుణ్ ముందుగా గుర్తుకు వస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ ను సంపాదించారు. కానీ అంతే తొందరగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 4, 2024 / 01:31 PM IST

    Tollywood Heroes

    Follow us on

    Tollywood Heroes: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీనటులు వస్తుంటారు. వెళ్తుంటారు. ఆర్టిస్టులు, కమెడియన్ లు, స్టార్లు ఇలా ఎంతో మంది ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి మరీ కనిపించకుండా వెళ్తుంటారు. అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి దూరమైన వారు ఎందరో ఉన్నారు. ఫుల్ టాలెంట్ ఉండి కూడా కనుమరుగైన వారు కొందరు. ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైన టాలెంటెడ్ హీరోలు ఎవరు? ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. మరి ఆలస్యం ఎందుకు? చదివేయండి..

    వెండితెరకు దూరమైన హీరోలలో తరుణ్ ముందుగా గుర్తుకు వస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ ను సంపాదించారు. కానీ అంతే తొందరగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. లవర్ బాయ్ గా పేరు సంపాదించిన ఈయన ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. వరుణ్ సందేశ్ కూడా ఒకప్పుడు సినిమాల్లో నటించి ప్రస్తుతం దూరమయ్యారు. ఆ సమయంలోనే వితికాను ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇక అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అనే వివరాలు తెలియడం లేదు.

    తెలుగులో చివరగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో అలరించారు. కానీ తర్వాత సినిమాల్లో కనిపించడం లేదు. సందీప్ కిషన్ కూడా ఈ మధ్య వెండితెరపై కనిపించడం లేదు. ఈయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో సినిమాకు కాస్త దూరమయ్యారు. ఈయన నటించినా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో? కూడా తెలియడం లేదు. నారా రోహిత్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో నటించేవారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈయన కూడా సినిమాల్లో కనిపించడం లేదు. చివరగా 2018లో వీరభోగ వసంత రాయలు అనే సినిమాలో నటించారు.

    సుమంత్ అశ్విన్ కూడా ఒకప్పుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. కానీ కాస్త ఇప్పుడు సినిమాలకు కాస్త దూరం అయ్యారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన వేణు తొట్టెంపూడి కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నార. ఈ మధ్య కాలంలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోలుగా పేరు సంపాదించిన అభిజిత్, సుధాకర్ లు కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అభిజిత్ ప్రస్తుతం ట్రావెలర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా రోహిత్ రెడ్డి, హీరో రాజా వంటి వారు కూడా సినిమాలకు దూరం అయ్యారు.