Rajamouli Movies : దర్శకధీరుడు రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాయి.ఒక సినిమా ఎలా తీస్తే ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఎక్కడ ఎలివేషన్స్ , ఎక్కడెక్కడ ఎమోషన్స్ రావాలో చాలా క్యాలిక్యులేటెడ్ గా రాసుకొని సినిమాలు తీసే ఒకే ఒక్క ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి.
ఇక ఇప్పటివరకు ఈయన తీసిన ప్రతి సినిమా కూడా 90% మెంబర్స్ కి నచ్చుతునే వచ్చాయి. ప్రేక్షకులందరి గురించి పక్కనపెడితే రాజమౌళి తీసిన సినిమాల్లో ఆయనకు నచ్చని సినిమాలు కూడా ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. అంటే దర్శకుడుగా ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమంలో సినిమాలు సక్సెస్ అయితే అయ్యాయి, కానీ తను ఆ సినిమాని చూస్తున్నప్పుడు ఇంతకంటే బాగా చేయొచ్చు కదా అని ఆయన అనుకున్న కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.
అవేంటి అంటే తను మొదటి సినిమాగా చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఒకటైతే, ఎన్టీయార్ తోనే చేసిన యమదొంగ సినిమా మరొకటి ఈ రెండు సినిమాలు వర్క్ పరంగా ఆయనకి పెద్దగా నచ్చలేదట. అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న టెక్నాలజీని బట్టి ఆయనకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఆ సినిమాలు తీశాడు. కానీ ఇప్పుడు ఆ సినిమాలను చూస్తుంటే కొన్ని సీన్లు ఇంకా బాగా తీసి ఉండచ్చు కదా అని తనకు తనే రీగ్రెట్ అవుతూ ఉంటాడంటా.
కానీ ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులకు మాత్రం అవి విపరీతంగా నచ్చాయి. ఇక సక్సెస్ ల పరంగా ఆ సినిమాలు ఓకే కానీ తన వర్క్ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం తనకు ఆ సినిమాలు అంత సంతృప్తి ని ఇవ్వలేదట. అందువల్లే తను ఒక సినిమా చేయాలి అంటే ఆ సినిమా మీద పూర్తిగా ఎఫర్ట్ పెట్టి ఆ సినిమాలు సూపర్ గా వచ్చేంత వరకు సీన్ల ను తీస్తూనే ఉంటాడు. ఒక సినిమా కోసం చాలావరకు కష్టపడుతూ ఉంటాడు కాబట్టే తను మిగతా దర్శకుల కంటే సపరేట్ ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు…