Agricultural Land: వ్యవసాయం దండగ నుంచి.. పండగ అని మారుతున్న రోజులు ఇవి. వ్యవసాయ రంగంపై ఆధారపడి స్వయం సమృద్ధి సాధిస్తున్న దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అయితే అక్కడ భౌగోళిక పరిస్థితులు,ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటివి ప్రభావం చూపుతున్నాయి. అయితే ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయి. రాజకీయంగాను స్వతంత్రంగా ఉంటూ తాము అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకుంటున్నాయి.ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. అందులో భారతదేశం కూడా ఉండడం విశేషం.
భారతదేశ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.ప్రత్యక్షంగా,పరోక్షంగా సాగుపై ఆధారపడుతున్నారు.వ్యవసాయం మనకు ఆహారాన్ని అందించడమే కాకుండా.. దేశాభివృద్ధికి సహాయపడే అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలు కూడా అందిస్తోంది.అయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ లేకపోవడం, మద్దతు ధర దక్కకపోవడం, సాగు పెట్టుబడులు పెరిగిపోవడం,ప్రభుత్వాల ప్రోత్సాహం కరువవ్వడం వ్యవసాయానికి శాపంగా మారింది.
1.వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్న దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. ఈ దేశంలో 80.77% వ్యవసాయ భూమి ఉంది. నీటి కొరత ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది ఈ దేశం.
2. అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశాల జాబితాలో దక్షిణాఫ్రికాది రెండో స్థానం. దేశంలో 79.4% వ్యవసాయ భూమి ఉంది. ఆధునిక పద్ధతులతో ఇక్కడి రైతులు సాగు చేపడుతున్నారు.
3. వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్న జాబితాలో దాయాది రాష్ట్రం బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. దేశ భూభాగంలో 77.3% వ్యవసాయ భూమి ఉంది. ఈ దేశ ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
4. నైజీరియా నాలుగో స్థానంలో ఉంది. దేశ భూభాగంలో 75.4% వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
5. మంగోలియా ఐదో స్థానంలో నిలిచింది. 72.3% వ్యవసాయ భూమి ఉంది. ఈ దేశంలోనూ పేదరికం ఎక్కువ. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు.
6. 71.3% వ్యవసాయ భూమితో ఉక్రెయిన్ ఆరో స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. రష్యాతో యుద్ధంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది.
7. 71.2% వ్యవసాయ భూమితో యునైటెడ్ కింగ్ డమ్ ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధిక వ్యవసాయ పద్ధతులతో సాగు చేపడుతున్నారు.
8. 65.5% వ్యవసాయ భూమితో డెన్మార్క్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశ భూభాగంలో 60 శాతానికి పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉంది.
9. దాదాపు దేశ భూభాగంలో 64.9% తో వెస్ట్ బ్యాంక్ గాజా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.
10. 6.9 మిలియన్ హెక్టార్ల భూమితో ఐర్లాండ్ పదో స్థానంలో నిలిచింది. అయితే ఇందులో 63% భూమి వ్యవసాయానికి అనువుగా తేలింది.
11. 60 శాతం వ్యవసాయ భూమితో భారత్ 11 వ స్థానంలో నిలవడం విశేషం. గుజరాత్, బీహార్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాగు చేపడుతున్నారు.