New Year Celebrations: 2023కు బైబై చెప్పే టైం దగ్గర పడుతోంది. 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో అడుగుపెట్టే క్షణాలను సెలబ్రేట్ చేసుకునేందుకు, పాత ఏడాదికి సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ ప్రపంచ అందరీక ఒకేరోజు మొదలవుతుంది. కానీ, కొన్ని గంటల తేడా ఉంటుంది. కొన్ని దేశాల్లో ముందుగా, కొన్ని దేశాల్లో ఆలస్యంగా వేడుకలు జరుపుకుంటారు. ముందుగా ఎక్కడ జరుపుకుంటారో తెలుసుకుందాం.
ఆ దీవుల్లో అందరికంటే ముందు..
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల కాలమానం ప్రకారం కాస్త అటూ ఇటుగా వేడుకలు ప్రారంభమవుతాయి. ముందుగా పసిఫిక్ దీవులైన టోంగా, సమోవా, కిరిబాటి దేశాల్లో అందరికంటే ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఈ దేశాల్లో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు వేడుకలు ప్రారంభమువతాయి. ఇక జనావాసాలు లేని హౌలాండ్, బేకర్ దీవుల్లో అందరికంటే ఆలస్యంగా కొత్త సవంత్సరం మొదలవుతుంది. ఇక్కడ సాయంత్రం 5:30 గంటలకు వేడుకలు జరుపుకుంటారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో గంటల వ్యవధిలో తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి.
ఎలా జరుపుకుంటారో తెలుసా..
న్యూ ఇయర్ వేడుకలను ప్రపంచ దేశాలు ఎంతో వైభవంగా జరుపుకుంటాయి. న్యూయార్క్ సిటీలో బాల్ డ్రాప్, స్పెయిన్‌లో ద్రాక్ష పండ్లు తినడం వంటి సంప్రదాయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ సంప్రదాయాలను పాటిస్తాయి. సరిగ్గా గడియారం 12 గంటలు కొట్టగానే సంవత్సరం, తేదీ మారగానే సెలబ్రేషన్స్ మొదలు పెడతారు.