Salaar – Khansar City : పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తనదైన రేంజ్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేశాడు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా సక్సెస్ పైన చాలా మంది అభిమానులు వాళ్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పాన్ ఇండియా హీరో గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్తుంది…
అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మరో కీలక పాత్రలో నటించిన నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు…అయితే ఈ సినిమా మొత్తం ఖాన్సర్ అనే ఒక సిటీ నేపథ్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఆ సిటీ మీదే ప్రేక్షకుడి కన్ను పడింది. అందుకే ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ప్రాంతం ఎక్కడుంది అని విపరీతంగా వెతుకుతున్నారు. అయితే ఆ సిటీ నిజంగానే ఉందా లేదా అనే దాని మీద చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి…
అయితే ఈ ప్రాంతం ఎక్కడుంది అంటే ఇరాన్ లోని ఇస్ఫాహాన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక ఇక్కడ 22 వేలకు పైగా పరిషియన్లు నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సర్ సిటీకి ఇరాన్ లోని ఖాన్సార్ కౌంటి కి అసలు సంబంధమే లేదు… సినిమా కోసం జస్ట్ ఇమాజిన్ తో సృష్టించిన ప్రాంతం మాత్రమే ఇది… అసలు ఆ ప్రాంతానికి దీనికి సంబంధం లేదు. అయితే సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం ఎక్కడుంది అంటూ గూగుల్లో విపరీతంగా వెతుకుతున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కోసం జస్ట్ ఆ పేరు మాత్రమే వాడుకున్నాడు…
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా లాంగ్ రన్ లో వెయ్యికోట్లకు పైన వసూళ్లను రాబడుతుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు వేల కోట్ల కలక్షన్స్ తో బాహుబలి సినిమా ఇండియాలో నెంబర్ వన్ కలక్షన్లు సాధించిన సినిమాగా ముందు వరుసలో ఉండగా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి 1000 కోట్ల మార్క్ దాటబోతున్నాడు అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…