https://oktelugu.com/

Bigg Boss title winners : బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్… ఆ ఆరుగురు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

కాగా సీజన్ 5 విన్నర్ విజె సన్నీ అయ్యాడు. సన్నీ కి బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమ్ వచ్చింది. ఇప్పుడు చిన్న సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2023 / 01:37 PM IST
    Follow us on

    Bigg Boss title winners : బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సక్సెస్ఫుల్ గా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కాగా బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 6 వరకు విన్నర్స్ ఎవరు .. రన్నర్స్ ఎవరు .. వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు అనేది తెలుసుకుందాం. బిగ్ బాస్ మొదటి సీజన్ జూలై 16, 2017 లో ప్రారంభం అయింది.

    బిగ్ బాస్ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ గా వ్యవహరించారు. సీజన్ 1 విన్నర్ గా శివ బాలాజీ నిలిచాడు. రన్నర్ గా ఆదర్శ్ బాలకృష్ణ నిలిచాడు. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో కనిపించడమే లేదు. ఆయన తన బిజినెస్ లు చూసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక సీజన్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచాడు. ఈయన ఇప్పుడు కనుమరుగయ్యారు. అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంటాడు.

    బిగ్ బాస్ సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యారు. ఇతనికి బిగ్ బాస్ బాగానే కలిసొచ్చింది. ఈ షో తర్వాత రాహుల్ స్టార్ సింగర్ అయిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ తో మరింత క్రేజ్ సంపాదించాడు. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. సీజన్ 4 లో అభిజిత్ గెలిచాడు. ఈ హీరో కూడా బిగ్ బాస్ తర్వాత కనుమరుగయ్యాడని చెప్పాలి. రన్నర్ గా అఖిల్ సార్ధక్ నిలిచాడు.

    కాగా సీజన్ 5 విన్నర్ విజె సన్నీ అయ్యాడు. సన్నీ కి బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమ్ వచ్చింది. ఇప్పుడు చిన్న సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఇక సీజన్ 6 విన్నర్ సింగర్ రేవంత్ నిలిచాడు. శ్రీహాన్ రన్నర్ అయ్యాడు. అయితే రేవంత్ కి అప్పట్లో బాగా క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కాస్త స్లో అయినట్లు తెలుస్తుంది. ఇక శ్రీహాన్ పరిస్థితి కూడా అంతే. ఇక లేటెస్ట్ టైటిల్ విన్నర్ ప్రశాంత్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి…