https://oktelugu.com/

Tornado: వైరల్ వీడియో: టోర్నడో మధ్యలోకి కారులో వెళితే ఎట్లా ఉంటుందో తెలుసా?

గత శనివారం(డిసెంబర్‌ 9) అర్ధరాత్రి 2గంటల సమయంలో సంభవించిన డోర్నడో తుపాన్‌తో అనేక మంది నిర్వాసితులయ్యారు. అప్రమత్తమైన అధికారులు నిర్వాసితులకు స్థానిక హైస్కూళ్లలో ఆశ్రయం కల్పించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 12, 2023 / 01:59 PM IST

    Tornado

    Follow us on

    Tornado: అమెరికాలో ప్రకృతి విపత్తులు, తుపాను బీభత్సాలు సర్వ సాధారణంగా మారుతున్నాయి. తాజాగా శనివారం సెంట్రల్‌ టెన్నెస్సేలోని అనేక నగరాల్లో తీవ్రమైన తుపాన్ల బీభత్సానికి ఇళ్లు, వ్యాపార సంస్థలు విధ్వంసమయ్యాయి. ఆరుగురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. కెంటుకీ రాష్ట్రం సరిహద్దు సమీపంలో నాష్‌విల్లెకు ఉత్తర ప్రాంతంలో మోంట్‌గోమెరీ కౌంటీని టోర్నడో చిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారితోసహా ముగ్గురు చనిపోయారు. తుపాను విధ్వంస దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తుపానులో చిక్కుకున్న ఓ డ్రైవర్‌ పడిన ఇబ్బందులు వాహనం డ్యాష్‌ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడవి వైరల్‌ అవుతున్నాయి.

    శనివారం అర్ధరాత్రి..
    గత శనివారం(డిసెంబర్‌ 9) అర్ధరాత్రి 2గంటల సమయంలో సంభవించిన డోర్నడో తుపాన్‌తో అనేక మంది నిర్వాసితులయ్యారు. అప్రమత్తమైన అధికారులు నిర్వాసితులకు స్థానిక హైస్కూళ్లలో ఆశ్రయం కల్పించారు. టెన్నెస్సేలో శనివారం రాత్రి సుడిగాలి ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. నిమిషానికి 154 మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు జనసీవనం చిన్నాభిన్నమైంది. రాష్ట్రంలోని వేలాది మందికి విద్యుత్తును దూరం చేసింది. దాదాపు 85 వేల మందికి విద్యుత్‌ సౌకర్యం లేకుండా పోయింది. గ్రామీణ పట్టణంలోని డ్రెస్డెన్‌లో తుఫానుల కారణంగా అనేక చెట్లు, విద్యుత్‌ లైన్లు, ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని అత్యవసర సేవలు తెలిపాయి.

    డ్రైవర్‌ చిక్కుకుని..
    ఇక నిమిషానికి 154 మీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలుల్లో ఓ కారు డ్రైవర్‌ చిక్కుకున్నాడు. హార్రర్‌ సినిమా తరహాలో అతను బలమైన గాలులకు వాహనం నడిపేందుకు, గాలి తీవ్రతకు కారుపైకి దూసుకువస్తున్న పైకప్పులు, చెత్తచెదారం, దుంగలను తప్పించుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యాలన్నీ కారు డ్యాష్‌ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాలు తుపాను తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒళ్లు గగ్గుర్లు పొడిచేలా ఉందని కామెంట్‌ చేస్తున్నారు.